గుంటూరు

రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా కేంద్రంపై నిందలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూన్ 17: రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ అంశాలపై అవగాహన లేకుండా అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ప్రచారం చేయటం దారుణమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాధబాబు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని బీజేపీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ రాష్ట్రానికి వాటిపై అవగాహన లేక నెపాన్ని కేంద్రంపై మోపుతున్నారని ఆరోపించారు. పోలవరం, అమృత పథకం, ఇండస్ట్రియల్ కారిడార్స్, మూడు లైన్ల రైల్వే ట్రాక్ వంటి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అవగాహన లేకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అసత్య ప్రచారం చేయటం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అంచలంచెలుగా నిధులు విడుదల చేస్తుంటే వాటిని ఇతర పథకాలు, ఈవెంట్స్, అవసరాలకు వాడుకుని కేంద్రం పట్టించుకోవటం లేదని, నిధులు విడుదల చేయటంలేదని నిందలు మోపడం టీడీపీకి తగదని హితవు పలికారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు అసత్య ఆరోపణలతో కాలం వెళ్ళదీస్తున్నారో త్వరలోనే బయటపడనుందని చెప్పా రు. సమావేశంలో బీజెపీ మండల అధ్యక్షుడు కొత్తపల్లి యోగానందకిషోర్, తరిమిశ అనంతాచార్యులు, కఠారి వాసుదేవనాయుడు, తోటకూర కోటేశ్వరరావు, బిట్ర కనకదుర్గ, మల్లపురాజు కనకదుర్గ, గుండపనేని పూర్ణచంద్రరావు, శిఖా రవీంద్ర, ఆర్ వెంకటేశ్వరరావు, మంచాల రత్నరాజు, అంజనీదేవి, మద్దెల కృష్ణకాంత్, గాలి సూర్యనారాయణ, కుషాల్‌రాజ్‌జైన్, బసివిరెడ్డి, దొడ్డా జార్జి, షేక్ షబ్బీర్, సుబ్బరాజు, నరేంద్రవర్మ, శివరామకృష్ణ, సంకా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

విద్యతో పాటు సంస్కృతీ, సంప్రదాయాలు అవశ్యం
మంగళగిరి, జూన్ 17: విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతీ, సంప్రదాయాలు నేర్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర యువజన క్రీడలు, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అన్నారు. నూతక్కి గ్రామంలో గల విజ్ఞాన విహార పాఠశాల ప్రాంగణంలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి వర్షారంభ సమావేశాల్లో ఆదివారం ఆయన ప్రసంగించారు. వ్యక్తిత్వ వికాసాన్ని విద్యార్థులకు విద్యాభారతి పాఠశాలల్లో అందించడం శుభపరిణామమని, ఎంత పెద్దవారైనా గురువు ముందు బలహీనురేనని, గురుకృప లేనిదే ఈ సమాజానికి శ్రేయస్సు లేదని ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అన్నారు. శివానందమూర్తి మాట్లాడుతూ సమాజం, ధర్మం, సంస్కృతి, అందరినీ గౌరవించడం లాంటి విషయాలు ప్రస్తావించారు. దీర్ఘకాలంగా పనికి వచ్చే యోజనాలు విద్యార్థులకు అందించాలని, మార్కులకే పరిమితం కారాదని, చిన్న సమస్యను అధిగమించలేని ఎందరో ఉన్నారని, ఆలోనతో పరిష్కారం చేసుకునే వారెందరో ఉన్నారని, దేశ భక్తిని పెంపొందించాలని అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరణలోకి తేవాలని, వేతనం కాకుండా సేవాభావంతో పనిచేయాలని ఆయనన్నారు. నేడు ఆథ్యాత్మిక ఒరవడి నెలకొందని, దానికొక నిర్వచనం ఇవ్వాలని, మనం చేసే సేవకు ఏదో ఒకరోజు ప్రతిఫలం ఉంటుందని, భగవంతుని కృప ఉన్నప్పుడు మనకు రావాల్సింది వస్తుందని ఆయనన్నారు. విశ్రాంత ఐఎఎస్ అధికారి సిహెచ్ ఉమామహేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.