గుంటూరు

పంచాయతీ ఎన్నికలకు సిద్ధవౌతున్న ప్రభుత్వం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూన్ 17: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధవౌతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారుల బదిలీలు జరుగుతాయని అనుకుంటున్నారు. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికి అన్ని పంచాయతీల సర్పంచ్‌ల అధికారాలు రద్దు కానుండటంతో తిరిగి ముందుగానే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలుత తెనాలి ఆర్డీఓ జి నరసింహులును తిరుపతికి, మండల తాహశీల్దార్ జివి సుబ్బారెడ్డి, తెనాలి మండలం, మున్సిపాలిటీ, వివిధ శాఖలలో 3 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 50 శాతం మహిళలకు జెడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌ల పదవులలో రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. అయినా అందులో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అవకాశం కల్పించారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం కూడా అదే పద్ధతి పాటిస్తుందా లేక రిజర్వేషన్ల ప్రాతిపదికన మరో విధానం అమలు చేస్తుందా అంటూ సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం అన్ని పార్టీలు పోరాటాలు చేస్తున్న క్రమంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేస్తారనే మరో మాట వినవస్తోంది. ఇదే జరిగితే మరో సంవత్సర కాలంపాటు సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటిసిల పదవీ కాలం పొడిగింపు, లేదా కార్యదర్శుల పాలన పొడిగింపు కొనసాగవచ్చునని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. గత కాంగ్రెస్ పాలనలో సుమారు రెండు సంవత్సరాలపాటు స్థానిక ఎన్నికలు జరపకుండా అధికారులతోనే పరిపాలన కొనసాగించిన విషయం తెలిసిందే అయినా అదే పద్ధతిని నేడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అవలంబించనుందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం కోసం గ్రామ, మండల స్థాయి వివిధ పార్టీల చోటా నాయకులు, ఆశావహులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.

గ్రామ సమస్యల పరిష్కారానికే పల్లె మేలుకొలుపు
అమరావతి, జూన్ 17: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలో పల్లె మేలుకొలుపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని వైకుంఠపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పక్కాల సూరిబాబు జిల్లా కార్యదర్శి నండూరి కరుణకుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానూరి రమేష్‌బాబు, వైకుంఠపురం ఎస్సీ కాలనీలో విస్తృతంగా పర్యటించి స్థానికుల ద్వారా అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిమెంటు రోడ్లు వేసి సైడ్ కాల్వలు నిర్మించకుండా వదిలేయడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని, పాదాచారులు సైతం వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. దీంతో పల్లెల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ గ్రామ సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదని, ప్రతిపక్ష నాయకులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిచండంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
మంగాదేవితో పాటు
పలువురు కాంగ్రెస్‌లో చేరిక...
ప్రముఖ దస్తావేజులేఖరి, బీజేపీ నాయకురాలు కారసాల మంగాదేవితో పాటు సుమారు 50 మందికి పైగా బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలోకి చేరిక మంగాదేవిని పక్కాల సూరిబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీశెట్టి ఏడుకొండలు, రంగిశెట్టి ఏడుకొండలు, షేక్ జాని, ఎం వేదాద్రి, షేక్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.