గుంటూరు

కిక్కిరిసిన సూర్యలంక తీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల, జూన్ 17: పవిత్ర రంజాన్ సంబరాలు ఆదివారం బాపట్ల మండలంలోని సూర్యలంక తీరంలో జరిగాయి. అల్లా ఖురాన్‌ను ఆవిష్కరించిన పవిత్రమైన రంజాన్ మాసం మొత్తం 30 దినాలపాటు పవిత్ర ఉపవాస దీక్ష కొనసాగించిన ముస్లింలు చంద్రవంకను దర్శించుకున్న అనంతరం చేసే నదీ స్నానాన్ని, సముద్ర స్నానాన్ని అత్యంత పుణ్యప్రదంగా భావిస్తున్నారు. ఇదే క్రమంలో రంజాన్ వేడుకల్లో భక్త జన సంద్రమై సూర్యలంక తీరానికి చేరుకున్నాయా అన్నట్లు ఆదివారం నాడు తీరం కిటకిటలాడింది. గుంటూరు జిల్లా నలుమూలల నుండి, ప్రకాశం, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల నుండి ముస్లింలు పెద్ద సంఖ్యలో తీరానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వీరి రాకను ముందుగానే ఊహించిన బాపట్ల డిఎస్‌పీ గంగాధరం ట్రాఫిక్‌ను నియంత్రించారు. 200 మంది సిబ్బందిని దారి పొడవునా నియమించి వాహనాల రాకపోకలను అదుపుచేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ కొనసాగించారు. సుమారు 2 లక్షలకుపైగా యాత్రికులు తీరానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఒక అంచనా.

ఏపీ ఎన్జీవో నాయకులపై దాడి హేయం
గుంటూరు, జూన్ 17: హైదరాబాద్‌లోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఆదివారం జరిగిన హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి అశోక్‌బాబు, ఎన్ చంద్రశేఖరరెడ్డిలపై జరిగిన హేయమైన చర్యని ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ బాజిత్, సిహెచ్ రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఏపీ ఎన్జీవో జిల్లా కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో బాజిత్ మాట్లాడుతూ ప్రశాంతంగా సమావేశం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఎన్జీవో నాయకులు కొందరు కుట్రభావంతో అకారణంగా అశోక్‌బాబు, చంద్రశేఖరరెడ్డిలపై దాడి చేయడమే కాకుండా తీవ్ర పదజాలంతో ధూషించడం హేయమైన చర్యన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం పిరికిపందల చర్య అని అభివర్ణించారు. దాడిచేసిన వారిపై తక్షణపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి జి శ్రీనివాసరావు, జిల్లా జాయింట్ సెక్రటరి బి కొండారెడ్డి, నగర అధ్యక్షులు కెఎన్ సుకుమార్, విఆర్‌ఒ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజశేఖర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.