గుంటూరు

భవితకు భరోసా నానే్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూన్ 17: నాన్నంటే అనురాగానికి, భవితకు భరోసా అని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఫాదర్స్ డే వేడుకల్లో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆదివారం అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ అధ్యాపకులు పి సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎన్ తిరుపతయ్య మాట్లాడుతూ ఆత్మీయతకు, జీవితానికి దిక్సూచి నానే్ననన్నారు. చిన్నతనం నుండి చేయి పట్టుకుని జీవితానికి అర్ధం, పరమార్ధం చూపే మార్గదర్శి నాన్న అన్నారు. సాహితీవేత్త సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ నాన్న ప్రేమకు హద్దులు లేవన్నారు. కుటుంబంలో కష్టాలను తాను మోసి ఇతరులకు సుఖాన్నిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న అని కొనియాడారు. సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని చెప్పిన సంస్కృతి మనదన్నారు. జన్మనిచ్చిన తల్లి కొద్దికాలం మాత్రమే ఆలనాపాలనా చూస్తుందని, ఆ తర్వాత ఆ చిన్నారుల బాధ్యతను తండ్రి చూస్తాడన్నారు. ఈ సభలో శ్రీనివాసరావు, బిల్లా వేదయ్య, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.