గుంటూరు

ఐక్యపోరాటంతోనే కార్మిక సమస్యలు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 17: పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఎఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన నియోజకవర్గ ఎఐటీయుసీ 10వ మహాసభలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కంచర్ల కాశయ్య అధ్యక్షత వహించారు. రాధాకృష్ణమూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ఉపాధిని దెబ్బతీసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని, పాలకులు ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని, కేంద్రంమో మోదీ అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని. ఈ ప్రభావం నిత్యావసర సరుకులపై పడి సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందని అన్నారు. పెరుగుతున్న ధరలను పాలకులు అదుపు చేయలేకపోతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెం చడం లేదని ఆయన అన్నారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాల కోసం ఎఐటీయుసీ పోరాడుతోందన్నారు. సీపీఐ ఏరియా కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఎఐటీయుసీ నియోజకవర్గ కార్యదర్శి షేక్ దస్తగిరి, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఆర్‌టీసీ ఈయు జిల్లా కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి జాలాది జాన్‌బాబు తదితరులు ప్రసంగించారు. అనంతరం 22 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. ఎఐటీయుసీ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులుగా చిన్ని సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కంచర్ల కాశయ్య, ఉపాధ్యక్షులుగా మునగాల రామారావు, ఎం నాగమణి, ప్రధాన కార్యదర్శిగా షేక్ దస్తగిరి, సహాయ కార్యదర్శులుగా గంజి వెంకయ్య, జిలాని, కోశాధికారిగా వెంకట్రావు ఎన్నికయ్యారు.