గుంటూరు

ఈశ్వర ఆరాధనతోనే సకల శుభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 18: ఈశ్వర ఆరాధనతోనే ప్రజలకు సకల శుభాలు కలుగుతాయని శృంగేరీ శారదాపీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి అన్నారు. విజయాత్రలో భాగంగా స్వామివారు తన పరివారంతో సహా సోమవారం ఉదయం పంచారామాల్లో అగ్రగామియైన అమరావతి క్షేత్రాన్ని సందర్శించారు. అమరావతి అమరేశ్వరాలయానికి విచ్చేసిన స్వామివారికి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కెబి శ్రీనివాస్, ఇనిస్పెక్టర్ సిహెచ్ శివప్రసాద్, ఆలయ అధికారి శ్రీనివాసరెడ్డి, పూర్ణకుంభంతో స్వాగతం పలికి, మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. విధుశేఖర భారతీ మహాస్వామి స్వయంగా తానే అమరేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాన్ని జరిపించారు. అలాగే బాలచాముండికా అమ్మవారికి కూడా విశేష అర్చనలు, పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అమరేశ్వర స్వామి దేవస్థానానికి శృంగేరీపీఠం తరపున వెండి జగ్గు, 58 బంగారు పుష్పాలు, సుమారు లక్ష రూపాయల విలువ చేసే ఆభరణాలను అందజేశారు. ఈ పూజా వేడుకల్లో ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ కూడా పాల్గొన్నారు. ఆలయ మొదటి ప్రాకారంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై విధుశేఖర భారతీ స్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. అమరావతి క్షేత్రంలోని అమరేశ్వర స్వామిని దేవేంద్రుడు ప్రతిష్ఠించి పూజలు చేశారని, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ ఆలయం ఉండటం వలన అనాదిగా ఈ క్షేత్రానికి మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ పరమేశ్వరుడి ప్రసాదం తీసుకుంటే సకల ఈతిబాధలు తొలగిపోతాయన్నారు. ఒక మహారాజు, శివభక్తుడు ఈశ్వరాధన చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొందారన్నారు. సకల శ్రే యస్సులు లభించాలనే ఉద్దేశంతో శా రదాపీఠం తరపున ఇక్కడకు విచ్చేసి స్వామికి స్వయంగా పూజలు జరిపించుకున్నట్లు తెలిపారు. సహకరించిన ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులను ఆశీర్వదించారు. వారు తెచ్చిన ప్రసాదాలను భక్తులకు అందజేశారు.