గుంటూరు

జన్మభూమి కమిటీలు దండుకుంటున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 18: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, అయితే అప్పుల్లో మాత్రం చంద్రబాబు అభివృద్ధి సాధించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవాచేశారు. గుంటూరు నగరంలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో సామూహిక దరఖాస్తుల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహశీల్దార్ నాగిరెడ్డికి దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే నేటికీ 2 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేక పోయారన్నారు. నేటికీ రాష్ట్రంలో ఎందరో పేదలు పక్కా ఇల్లు, రేషన్‌కార్డులు, పెన్షన్లు, సాగుభూమి లేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. పేదలకు పెన్షన్లు, ఇళ్లు ఇప్పిస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను విస్మరించిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ పోరంబోకు, ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్నారు. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు లేనివారికి పొజీషన్ సర్ట్ఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు గని, సీపీఐ నాయకులు నూతలపాటి చిన్న, కుమార్ నాయక్, అమీర్‌వలి, సురేష్, పిచ్చయ్య, రాగం అలివేలు మంగమ్మ, అరుణ్‌కుమార్, చెవుల పున్నయ్య, చల్లా మరియదాసు, తిరుమలరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మానవీయత మూర్త్భీవించిన సంఘ సేవకుడు గుమ్మడి
* సంస్మరణ సభలో ఎంపీ జయదేవ్ తదితర ప్రముఖుల నివాళి
గుంటూరు (కల్చరల్),జూన్ 18: దశాబ్దాలపాటు సమాజానికి తనదైన రీతిలో విశిష్టసేవలందించడమే కాకుండా బృందావన వెంకన్న ఆలయ నిర్మాణంలోనూ మహాప్రస్థానం రూపుదిద్దుకోవడంలో చివరిదాకా శ్రమించిన దివంగత గుమ్మడి రాధాకృష్ణమూర్తి మానవీయత మూర్త్భీవించిన సంఘ సేవకుడని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఘన నివాళులర్పించారు. సోమవారం రాత్రి బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై రాధాకృష్ణమూర్తి సంస్మరణ సభ వెంకన్న ఆలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య అధ్యక్షతన జరిగింది. అతిథులుగా విచ్చేసిన ఎంపీ జయదేవ్, మాజీ ఎంపి వై శివాజీ, వ్యాపారవేత్త కళ్లం హరనాథ్‌రెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ కె కృష్ణకుమారి, నన్నపనేని అయ్యన్నారావు, హృద్రోగ నిపుణుడు మురళీబాబురావు తదితరులు గుమ్మడితో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఉత్తమమైన వ్యక్తిత్వం సమాజానికి తాను ఏ విధంగా ఉపయోగపడాలో ఆచరణాత్మకంగా చూపించిన మంచి మనీషి గుమ్మడి అని కొనియాడారు.