గుంటూరు

నారుూబ్రాహ్మణులను అవమానించడం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 19: కనీస హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న నారుూబ్రాహ్మణులను చర్చలకు పిలిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని తీవ్రంగా అవమానించి, బెదిరించడం దారుణమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రస్తుతమున్న సెక్రటేరియట్ ప్రజా దేవాలయం కాదని, అదొక రాక్షస కోట అని దుయ్యబట్టారు. మంగళవారం గుంటూరులోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ కార్మికులు, శ్రమజీవులకు కనీసం వేతనం ఇవ్వలేమని సీఎం హోదాలో చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కల్గిన తనదని చెప్పుకునే చంద్రబాబు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ప్రతీసారి దిగజారిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తక్షణం నారుూబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ డీజీపీ మాలకొండయ్య మంచి అధికారి అని, తన మాట వినడం లేదని సీఎం ఇంటలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావు చేత తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

భక్తిప్రపత్తులతో పూజలు
పెదకూరపాడు, జూన్ 19: రామాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడిసాయి ఆలయంలో ఈనెల 21వ తేదీ జరగనున్న సాయివిగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రుత్విక్కులు ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. పూజల్లో ఆలయ నిర్మాణకర్త, ప్రముఖ ఆడిటర్ గడ్డిపాటి సుధాకర్ దంపతులు పాల్గొన్నారు. వేద పండితులు తొలుతగా విఘ్నేశ్వరునికి పూజలు, వాస్తుహోమాలు తదితర అనుబంధిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠింపజేయనున్న విగ్రహాలను గ్రామంలో మేళతాళాలతో ప్రత్యేకంగా అలంకరింపజేసిన వాహనంపై ఉంచి ప్రదర్శన గావించారు. ప్రదర్శనలో కోలాటం శివ నిర్వహించిన కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరింపజేశారు.