గుంటూరు

అభివృద్ధి చూసి ఓటెయ్యండి: స్పీకర్ కోడెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, జూన్ 19: అభివృద్ధిని చూసి ఓటు వేయాలని శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి 4 సంవత్సరాల్లో 6.35 కోట్ల రపాయలను కేటాయించామన్నారు. హౌసింగ్ స్కీం కింద గృహాలు నిర్మించామన్నారు. వైసీపీ వారికి కూడా పెన్షన్లు ఇస్తున్నామని, ఆడపడుచులకు హర్యానా నుండి నాలుగు గేదెలు తెప్పించి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. దళిత, గిరిజన యువతకు వివాహ సమయంలో 50 వేల రూపాయల చొప్పున ఆర్థికచేయూత నందిస్తున్నామన్నారు. గ్రామాల్లో ఏ పార్టీవారైనా ఘర్షణ పడితే ఉపేక్షించేది లేదన్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే స్వపార్టీవారిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు పోలీసులు చేసిన సేవలను అభినందించారు. రాజుపాలెం పశువుల ఆసుపత్రికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశామని, అదేవిధంగా రెడ్డిగూడెం గ్రామంలో మసీదు అభివృద్ధికి 5 లక్షల రూపాయలు, కోటనెమలిపురిలో మూడు మసీదులకు నిధులు మంజూరు చేశామన్నారు. తనకు సత్తెనపల్లి నియోజకవర్గంలో చాలా తక్కువ మెజార్టీ వచ్చిందని, ఈ సారి పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థికి అధిక మెజార్టీ అందించాలని కోరారు. ప్రతి గ్రామంలో డొంకరోడ్డు పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం ముగ్గురు ముస్లిం మహిళలకు 50 వేల చొప్పున పత్రాలను అందజేశారు. రైతులకు పెసలు, పొలం పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పులిబండ్ల వెంకటేశ్వర్లు, మార్కెట్‌యార్డు చైర్మన్ పూజల వెంకట కోటయ్య, పార్టీ మండల అధ్యక్షుడు అంచుల నరసింహారావు, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్రా బాబురావు, కెనాల్ కాల్వ డైరెక్టర్ అంకాల ప్రభుదాసు, సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వర్ల శ్రీనివాసరావు, సర్పంచ్ ఓర్సు శ్రీనివాసరావు, అధికారులు రాజేష్, నగేష్, పార్టీ నాయకులు శనగపోలు నరసింహారావు, మస్తానయ్య, కొండమోడు ఎంపీటీసీ దారెడ్డి సుబ్బారెడ్డి, సానికొమ్టు కోటిరెడ్డి, చావా శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా సీసీ, బీటీ రోడ్లు వెయ్యాలి
* నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్
గుంటూరు, జూన్ 19: వర్షాకాలం దృష్ట్యా నగరవాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా యుజిడి పనులు పూరె్తైన ప్రాంతాల్లో సీసీ, బీటీ రోడ్లను జూలై నెలాఖరు నాటికి పూర్తిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థలోని తన ఛాంబర్‌లో ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో యుజిడి పనులు పూరె్తైన ప్రాంతాల్లో గతంలో ఏ విధమైన రహదారులు ఉన్నాయో అదేవిధంగా రహదారులను నిర్మించాలని సూచించారు. ఇప్పటికే ప్రజల నుండి అనేక ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందుతున్నాయని, వర్షాకాలం ప్రారంభమైతే సమస్యలు మరింత అధికమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆర్‌అండ్‌బి అధికారులు ఎక్కడైతే తమకు కేటాయించిన రహదారులు ఉన్నాయో వాటిని తక్షణం పునరుద్దరించే చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ డిపాజిట్ చేస్తుందని తెలిపారు. యుజిడి పనులు వేగవంతం చేయాలని, పనులు పూరె్తైన మినహా మిగిలిన రోడ్లను ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారో లిఖితపూర్వకంగా అందజేయాలని ఆదేశించారు. దీనిపై కాంట్రాక్టు సంస్థ అయిన షాపూర్జీ పల్లోంజి ప్రాజెక్టు మేనేజర్ స్పందిస్తూ ఆగస్టు చివరి నాటికి పూర్తిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఎస్‌ఇ శ్రీనివాసరావు, ఇఇ సంతోష్, నగరపాలక సంస్థ ఎస్‌ఇ సత్యనారాయణ, ఇఇ డి శ్రీనివాసరావు, యుజిడి ప్రాజెక్టు మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.