గుంటూరు

పత్తి విత్తనాలపై సెస్సు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జూన్ 19: పత్తి కొనుగోలుపై ఒకశాతం సెస్సును రద్దు చేసినట్లు గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. మంగళవారం యార్డు కార్యాలయంలో కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ పత్తి కొనుగోలుపై సెస్సు చెల్లించిన తర్వాత సీడ్‌పై పన్ను చెల్లించడంతో వ్యాపారులపై అదనపు భారం పడుతోందని, దీనిని వ్యాపారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం స్పందించి సీడ్‌పై చెల్లిస్తున్న సెస్సును రద్దు చేయడం జరిగిందన్నారు. పత్తిని జిన్నింగ్ చేసిన తర్వాత సీడ్‌పై సెస్సు రద్దుచేసిన జీవో ఈనెల 7వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న సరుకుపై ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల గుంటూరు మార్కెట్ కమిటీకి 6 కోట్ల వరకు రాబడి తగ్గుతుందన్నారు. ఒక క్వింటా పత్తికి జిన్నింగ్ జరిపితే 66 శాతం సీడ్స్, 33 శాతం దూది వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గ్రేడ్-2 ఇస్మాయిల్, డైరెక్టర్ మన్నవ వెంకటేశ్వర్లు, కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు కొర్రపాటి రామారావు, ఈర్ల గురవయ్య, సూర్యనారాయణ, కొమ్మాలపాటి నాగమల్లేశ్వరరావు, చిట్టిప్రోలు ముక్కంటి, యార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీఎం సభను విజయవంతం చేయాలి
* ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్

గుంటూరు, జూన్ 19: తుళ్లూరు మండలం రాయపూడి వద్ద ఈనెల 22వ తేదీన ఎన్‌టిఆర్ ఐకాన్ టవర్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లతో పాటు సభ విజయవంతం చేసేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎ ఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఇన్‌ఛార్జి కలెక్టర్ ఇంతియాజ్ ఎన్‌టిఆర్ ఐకాన్ టవర్ శంకుస్థాపన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, ఏపి ఎన్‌టిఆర్ తెలుగు సొసైటీ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అమరావతి రాజధాని పరిధిలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సౌజన్యంతో నిర్మిస్తున్న ఎన్‌టిఆర్ ఐకాన్ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వేదిక, సీటింగ్, బారికేడ్ల ఏర్పాటులో నిబంధనల మేరకు వ్యవహరించాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించి ఏపి ఎన్‌టిఆర్ తెలుగు సొసైటీ చేపడుతున్న ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలన్నారు. రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి విచ్చేసే విఐపి, వివిఐపి, ఉన్నతాధికారులు, ప్రజలకు సంబంధించి వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చిట్టిబాబు, జిల్లా పంచాయతీ అధికారి అరుణ, ఏపి ఎన్‌టిఆర్ తెలుగు సొసైటీ డైరెక్టర్ సిహెచ్ రాజశేఖర్, కో ఆర్డినేటర్ రామప్రసాద్, ఓఎస్‌డి డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గన్నారు.