గుంటూరు

గుంటూరు చానల్‌లో పెరిగిన తూటాకు, గుర్రపుడెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 19: జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు, గుంటూరు నగరం, మంగళగిరి పురపాలక సంఘంతో పాటు 33 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న గుంటూరు చానల్‌లో తూటాకు, గుర్రపుడెక్క విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా చానల్‌లో పెరిగిన తూటాకును, గుర్రపు డెక్కను తొలగించే పనులు ప్రభుత్వం చేపట్టక పోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు మంగళగిరి వద్ద గుంటూరు చానల్‌లోకి మురుగునీరు చేరుతున్నప్పటికీ అధికారులు దాన్ని నియంత్రించే చర్యలు చేపట్టక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణానది నీటిని ప్రకాశం బ్యారేజీ కుడివైపు నుంచి గుంటూరు చానల్‌కు ఏటా 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం 47 కిమీ పొడవునా తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు రూరల్, చేబ్రోలు, వట్టిచెరుకూరు, పత్తిపాడు మండలాల పరిధి వరకు గుంటూరు చానల్ ద్వారా 27 వేల ఎకరాల భూమి సాగవుతోంది. వరి, మిరప, పత్తి, కాయగూరలు, పప్పు్ధన్యాలు మొదలైన పంటలు గుంటూరు చానల్ ద్వారా సరఫరా అయ్యే నీటితో రైతులు పండిస్తున్నారు. గుంటూరు నగరం, మంగళగిరి పురపాలక సంఘంతో పాటు 33 గ్రామాల ప్రజలకు గుంటూరు చానల్ దాహార్తిని తీరుస్తోంది. ఈ చానల్‌కు విడుదలయ్యే 4 టీఎంసీల నీటిలో 3.2 టీఎంసీలు సాగుకు, 1.42 టీఎంసీలు తాగునీటిగా వినియోగిస్తున్నారు. 2015 - 16 ఆర్ధిక సంవత్సరంలో 4 కోట్ల రూపాయలు వెచ్చించి చానల్‌లో పేరుకు పోయిన తూటాకు తొలగింపు, కట్టలు పటిష్ట పరచడం మొదలైన పనులు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమయ్యాక తూతూ మంత్రంగా పనులు నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధులు జేబులు నింపుకున్నారన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఈ ఏడాది కూడా ఇప్పటికే చానల్‌కు నీటి విడుదల నిలిపి వేశారు. తూటాకు తొలగింపు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వర్షాలు పడే సమయంలో పనులు చేపట్టడం, బిల్లులు చూసుకోవడం ఆనవాయితీగా మారిందని రైతులు విమర్శిస్తున్నారు. గుంటూరు చానల్‌ను ప్రకాశంజిల్లా పర్చూరు వరకు సుమారు మరో 30 కిమీ వరకు పొడిగించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది. 378 కోట్ల రూపాయలతో గుంటూరు చానల్ ఆధునీకరణకు పరిపాలన ఆమోదం మంజూరైందని, వచ్చే నెల టెండర్లు పిలిచేందుకు సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఇటీవల వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి గుంటూరు నగరం వరకు చానల్‌కు ఇరువైపులా సిమెంటుతో లైనింగ్ వేయాలన్న ప్రతిపాదనలు దశాబ్దకాలంగా ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పర్చూరు వరకు చానల్‌ను పొడిగించాలని ఐదు మండలాల రైతులు పెదనందిపాడులో ఆందోళన కూడా నిర్వహించారు. చానల్ పొడిగింపు వలన 50 గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందని, ఆయా మండలాల్లో పంటల సాగు మెరుగవుతుందని, ఆ ప్రాంత రైతులు పలుమార్లు విజ్ఞప్తులు చేసి ఆందోళన చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదు. 1961 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని తీర్మానం చేసిందని, ప్రభుత్వాలు మారినా పొడిగింపు అమలు చేయలేదని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో గుంటూరు చానల్ నిర్వహణకు లస్కర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, జేఈలు మొత్తం 32 మంది వరకు ఉండేవారు. 47 కిమీ పొడవున ఉన్న చానల్‌కు ప్రతి 8 కిలో మీటర్లకు ఒక లస్కరు, సెక్షన్‌కు ఒక వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉండేవారు. ప్రస్తుతం నలుగురు లస్కర్లు మాత్రమే ఉన్నారని, దీని వలన చానల్ నిర్వహణ సాధ్యం కావడం లేదని, తూటాకు పేరుకు పోవడానికి సిబ్బంది కొరత కూడా కారణమని చెబుతున్నారు. చానల్ పొడవునా గ్రామాల వద్ద పశువులు చానల్‌లో దిగి తూటాకు వలన ప్రమాదాల బారిన పడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వేసవికాలంలో చేపట్టాల్సిన తూటాకు తొలగింపు , చానల్ మరమ్మతుల పనులు వర్షాకాలం వచ్చినా చేపట్టక పోవడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి తూటాకు తొలగింపు పనులు త్వరిత గతిన చేపట్టి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు ఇందుకోసం నడుం బిగించాల్సిన అవసరం ఉంది.