గుంటూరు

మోదీ మళ్లీ ప్రధాని కావడం కల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, జూన్ 19: నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి కావడం కల్ల అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రంగా విమర్శించారు. మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామంలో భారీ రక్షిత మంచినీటి చెరువు వద్ద 1.35 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మైక్రో ఫిల్టర్ బెడ్‌ల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ జయదేవ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ బలహీనంగా ఉన్న పంజాబ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కుట్ర రాజకీయాలు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. తెలుగువారి వల్లే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందన్నారు. తెలుగువారు అత్యధికంగా ఉన్న కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 42 స్థానాల్లో కాంగ్రెస్ 36 స్థానాలు గెలుచుకుందన్నారు. అమర్‌రాజా పేరుతో ఏడు వేల కోట్ల రూపాయల టర్నోవర్ కల్గిన వ్యాపారాలు తమకు ఉన్నప్పటికీ జైలుకెళ్లడానికైనా సిద్ధపడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో తాను కేంద్రంతో పోరాడానని ఈ సందర్భంగా ఎంపీ గుర్తుచేశారు. ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. అలాగే 2014 ఎన్నికల సమయంలో గుంటూరు, తిరుపతి సభలకు వచ్చిన మోదీ ఢిల్లీకి ధీటైన విధంగా రాష్ట్ర రాజధాని కట్టిస్తానని చెబితేనే తాము ఎన్డీయేలో భాగస్వాములం అయ్యామన్నారు. దేశంలోని పంజాబ్, బీహార్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వారు కేంద్రంలో సంతృప్తికరంగా లేరన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఏపీలోని వైసీపీ, జనసేనలతో కలిసి అధికారం పొందాలని చూస్తోందని పేర్కొన్నారు.
ఇప్పుడు నాకు తెలుగు బాగానే వస్తుంది
2014 ఎన్నికల్లో నాకు తెలుగుభాష అంతగా వచ్చేది కాదని, దీనిన అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చాలా విమర్శలు చేశారని గల్లా జయదేవ్ అన్నారు. అయితే ఇప్పుడు తనకు తెలుగు బాగానే వస్తుందని చెప్పారు. ఏదైనా సాధించాలంటే భాష ప్రధానం కాదని, సబ్జెక్టే ముఖ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ఇఇ సత్యనారాయణ, ఎండీవో బి శివన్నారాయణ, చేబ్రోలు పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ ఖాదర్‌బాషా, టీడీపీ సీనియర్ నేత ఆచంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.