గుంటూరు

50 ఏళ్లుగా ఉంటున్నాం..కుల సర్ట్ఫికెట్లు ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాల, జూన్ 21: తెలంగాణ నుండి 50 ఏళ్ళ క్రితం వలస వచ్చి గురజాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న తమకు రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి కుల గుర్తింపులేక ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తమకు కుల సర్ట్ఫికెట్లు ఇచ్చి ఆదుకోవాలని కమిషన్ ఎదుట బేడ బుగడ జంగాలు వేడుకున్నారు. రాష్ట్రంలో బేడ బుడగ జంగాల కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి, చైర్మన్‌గా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జేసీ శర్మను నియమించింది. పట్టణంలోని బుడగజంగాల కాలనీలో చైర్మన్ శర్మ ఆధ్వర్యంలో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కులపెద్దలు పచ్చం వెంకటయ్య, గంధం చంద్రయ్య, హుస్సేన్, గంధం సూరయ్య, గంధం సైదులును విచారించి, వారి పుట్టు పూర్వోత్తరాలు, జీవన స్థితిగతులు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, సంప్రదాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన తాము తాత, ముత్తాతల కాలంలో జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాల్లో సంచార జాతులుగా తిరిగామన్నారు. దాదాపు 50 ఏళ్ళ క్రితం గురజాలకు వలస వచ్చి, స్థిర నివాసం ఏర్పరుచుకుని, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ తొమ్మిదో నెంబర్‌లో ఉన్న తమను రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అదే విధంగా సమితి మాజీ అధ్యక్షుడు జమ్మిగుంపుల రామారావు, బహుజన సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆలేటి మల్లయ్య, బేడ బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు నుండి కూడా బుడగ జంగాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం కమిషన్ చైర్మన్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించినా ఎక్కడా బేడ బుడగ జంగాల ప్రస్తావన కనిపించలేదన్నారు. విచారణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామన్నారు. అనంతరం ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తామన్నారు. ఈ విచారణలో గురజాల ఆర్డీవో మురళి, డిఎస్పీ ప్రసాద్, కమిటీ కార్యదర్శి రాధాకృష్ణమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు మల్లిఖార్జునరావు, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు, పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.