గుంటూరు

యోగా జీవననాదం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, జూన్ 21: యోగా ప్రక్రియను జీవితంలో భాగం చేసుకోవాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన యోగాలో మాట్లాడారు. యోగ ప్రక్రియ, శ్వాస, ధ్యానం ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. యోగాను ప్రతిరోజు తాను చేస్తుంటానని తెలిపారు. ఇతర దేశాల్లో యోగా ప్రచారం ఎక్కువగా ఉందని, దీనివల్ల ఆరోగ్యం కలుగుతుందన్నారు. వ్యాధులు రాకుండా ఉండేందుకు యోగా బాగా ఉపకరిస్తుందన్నారు. ప్రతిరోజు తాను యోగా, ధ్యానం గంటసేపు చేస్తుంటానని అన్నారు. ఈ యోగా ఒక రోజు కార్యక్రమంలా కాకుండా జీవిత కాలం చేయాలన్నారు. వయస్సు, ఆరోగ్యం, అవసరాన్ని బట్టి యోగా ప్రక్రియ చేసుకోవాలన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో యోగా ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తారన్నారు. మంగళగిరి యోగా కేంద్రం యోగా మాస్టర్ ఆతుకూరి వేంకటేశ్వర గురూజీ వజ్రాసనం, భుజంగాసనం, మకరాసనం, ప్రాణాయామం, నయన ప్రక్రియ తదితర ఆసనాలను అధికారులు, అతిథులు, విద్యార్థులచే వేయించారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఐదు నిమిషాలు కూర్చోవాలని, రాత్రి భోజనం అనంతరం వంద అడుగులు నడవాలని అన్నారు. కార్యక్రమాన్ని ఓంకారంతో ప్రారంభించి, శాంతి ప్రార్థనతో ముగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోడెల శివరాం, ఆర్డీవో గంధం రవీందర్, డిఎస్పీ కె నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ నాగసరపుసుబ్బరాయగుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, కమీషనర్ ఏ భానూప్రతాప్, ఎంఈ గడిపూడి వెంకటేశ్వరరావు, ఏఈలు రఫీ, ప్రవీణ్, స్టేడియం కమిటీ సభ్యు లు మందాడి రవి, డాక్టర్ రాంచంద్, కూనిశెట్టి వెంకట జనార్ధన గురూజీ, జె ఎన్‌టీయూకే ప్రిన్సిపల్ కెవీఎస్‌జీ ము రళీకృష్ణ, ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపల్ మహేష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోటప్పకొండ కాకతీయ సత్రం లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో స్పీకర్ కోడెల, టీడీపీ యువ నాయకుడు కోడెల శివరాం తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌టీపీ సర్వేయర్లు, ఇంజినీర్ల నిరసన దీక్ష
మంగళగిరి, జూన్ 21: తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ది వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్త నిరవధిక ఆందోళనలో భాగంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సర్వేయర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు నిరసన దీక్ష జరిపారు. ఎనెగ్జర్ 3 లో ఎల్‌టీపీ బాధ్యతలను తొలగించాలని, మాస్టర్ డేటాబేస్‌ను, జిఓ నెంబర్ 119 , ఏపీడీపీఎంఎస్ ఆన్‌లైన్‌లో త్వరగా పొందుపరచాలని, ఎల్‌టీపీలకు డ్రాఫ్టింగ్ లిమిట్స్ విధించరాదని, ప్లాన్ అప్రూవల్ ఫీజులను అధికారులే నిర్ణయించాలని, ఖాళీ స్థలంపై పన్ను ఆన్‌లైన్ చేయించాలని, పోస్టు వెరిఫికేషన్ బదులుగా ప్రీ వెరిఫికేషన్‌ను అమలు చేయాలని మొదలైన డిమాండ్ల సాధనకు దీక్ష జరిపారు. దీక్షలో మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలకు చెందిన ఎల్‌టీపీలు వీ మైనర్‌బాబు, పీ నిరంజన్ గుప్తా, సీహెచ్‌వీ నారాయణ, పీ అశోక్, వందన్‌కుమార్, కమలాకర్‌రెడ్డి, సాయిరాం ప్రసాద్, వీ నాగశ్రీనివాసరావు, సుమతి, హనుమాన్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.