గుంటూరు

చౌకబియ్యం అక్రమార్కుల వద్ద ఉంటే పీడీయాక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 21: ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా చౌకడిపోల ద్వారా రేషన్‌కార్డుదారులకు అందించే బియ్యం అక్రమార్కుల వద్ద ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీయాక్ట్ పెట్టేందుకు కూడా వెనుకాడబోమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళగిరి మార్కెట్‌యార్డు ప్రాంగణంలోని పౌరసరఫరాల శాఖ గోదాము (ఎంఎల్‌ఎస్ పాయింట్)ను గురువారం మంత్రి పుల్లారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిష్టర్‌ను పరిశీలించి నిల్వ ఉన్న సరుకులను అడిగి తెలుసుకున్నారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. చౌకడిపోల ద్వారా సరుకుల పంపిణీని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లోని చౌకడిపోల్లో వచ్చే నెల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని పుల్లారావు వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని ఫలితంగా అభివృద్ధి కొంత కుంటుపడుతోందని పుల్లారావు అన్నారు. చౌకడిపోల ద్వారా రేషన్‌కార్డుదారులకు అందిస్తున్న సరుకులు పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, మార్కెట్‌యార్డు చైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్, టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దార్ కల్యాణి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.