గుంటూరు

సీఎం పర్యటనకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 21: రెయిన్ ట్రీ పార్కు ఎదురుగా శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య ప్రతిష్ఠా మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. శుక్రవారం సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 826 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వీరిలో 9 మంది డిఎస్‌పిలు, 25 మంది సిఐలు, 62 మంది ఎస్ ఐలు తదితరులున్నారు.వివిధశాఖల వారిని అనుసంధానం చేస్తూ సీఎం పర్యటన ఆసాంతం ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నారు. రెయిన్ ట్రీ పార్కు ఎదురుగా ఉన్న ఆలయాన్ని గురువారం అర్బన్ ఎస్‌పి విజయారావు, ఇతర పోలీసు అధికారులతో క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బందోబస్తుకు నియమించిన అధికారులు, సిబ్బందిని ముందస్తుగా సమావేశపర్చి బందోబస్తు విధులను తెలియజేసి, సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. విధుల్లో ఎటువంటి అలసత్వం వహించరాదని స్పష్టంచేశారు. భద్రతా చర్యల్లో భాగంగా వివిధ విభాగాలను అనుసంధానం చేస్తూ స్పెషల్ టాస్క్ఫోర్స్ స్కీం, బాంబ్ స్క్వాడ్, ఏరియా డామినేషన్, రూఫ్‌టాప్, రోప్‌పార్టీలు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, నిఘా విభాగం, సేఫ్ హాస్పిటల్, సాయుధ బలగాలను సమన్వయపరుస్తూ విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌పిలు వైటి నాయుడు, తిరుపాల్, డిఎస్‌పిలు, ఎఆర్ డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.