గుంటూరు

మహిళలకు చట్టసభలో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జూన్ 24: మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక దాడులను అరికట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఏపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి కోలా స్వాతి డిమాండ్ చేశారు. పొన్నూరు సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమాఖ్య పట్టణ అధ్యక్షురాలు రావూరి సుగుణ సమావేశానికి అధ్యక్షత వహించారు. స్వాతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇంకా స్ర్తిలు వివక్షతకు గురవుతూనే ఉన్నారన్నారు. చిన్నారులు మొదలు పండు ముసలి వరకు దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవలికాలంలో గుంటూరు జిల్లా దాచేపల్లితో పాటు మోదుకూరు, తెనాలి తదితర ప్రాంతాల్లో దారుణ సంఘటనలు జరిగాయని, ప్రభుత్వం ఒకరిపై ఒక్కో విధంగా స్పందించడం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగం మాత్రం స్ర్తిలకు సమాన హక్కులు కల్పించామని చెప్తున్నా, చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళా హక్కుల సాధనకై ముందుకు సాగాలని స్వాతి పిలుపునిచ్చారు.
సభలో సీపీ ఐ పట్టణ కార్యదర్శి కీర్తి వెంకటేశ్వర్లు, ప్రజానాట్య మండలి నాయకుడు ఆరేటి రామారావు, సమాఖ్య నేతలు కె స్వప్నసుధ, కె సుశీల, రమణ తదితరులు పాల్గొన్నారు.