గుంటూరు

ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తున్న కేంద్రప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూలై 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం ఏసి కళాశాలలోని ఎడి హాలులో ఆలిండియా దళిత రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టానికి తూట్లు పొడిచే విధంగా సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చినప్పటికీ కేంద్రం ఆర్డినెన్స్ జారీచేయక పోవడం విచారకరమన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కులను కాపాడేందుకు తమ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు, ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షుడు గోళ్లమూడి రాజసుందరంబాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈనెల 7 నుండి ఎఐడిఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో కడప నుండి శ్రీకాకుళం వరకు బహుజన చైతన్య రథయాత్రను చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. సుప్రీంకోర్టుకు చట్టాలు చేసే అధికారం లేదని, అవి చట్టసభలకే ఉన్నాయన్నారు. 1989లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. తొలుత నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత, గిరిజన, ప్రజా, ఉద్యోగ ఐక్యవేదిక నాయకులు డాక్టర్ లక్ష్మానాయక్, మద్దు ప్రేమ్‌జ్యోతిబాబు, బేతపూడి భారతి, రమావత్ కృష్ణానాయక్, సతీష్, మాణిక్యాలరావు, కృష్ణమోహన్, చంద్రానాయక్, నల్లపు నీలాంబరం, ఈదా శ్రీనివాస్, రత్నం, ఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పనుల ముమ్మరం చేయాలి
* స్ట్రెచ్ డిజైన్లను త్వరితగతిన అందించాలి * కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్
గుంటూరు, జూలై 17: ఇన్నర్ రింగురోడ్డు ఫేజ్-3 పనులను పలకలూరు రోడ్డు జంక్షన్ నుండి మొదటి స్ట్రెచ్ ఎడమ వైపున 693 మీటర్ల ఎర్త్ డ్రైన్ పనులను గురువారం నుండి ప్రారంభించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ సి ఆర్ డి ఎ, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సిఆర్‌డిఎ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు, నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, గుంటూరు తహశీల్దార్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. స్ట్రెచ్‌ల వారీగా డిజైన్లను పరిశీలించారు. పనులు ప్రారంభించకముందే 80 అడుగుల రోడ్‌కు పూర్తిగా మార్కింగ్ ఇవ్వాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. అనంతరం తహశీల్దార్‌ను గడిచిన మూడు నెలల నుండి సబ్ డివిజన్ రికార్డు, ఎన్ని సర్వే నెంబర్లలో ఎంత మంది భూ యజమానుల నుండి రోడ్ కోసం భూ వివరాలతో కూడిన ఎంజాయ్‌మెంట్ సర్వే కోసం పూర్తిగా పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. అధిక ప్రాధాన్యత క్రమంలో మండల సర్వేయర్‌లతో మిగిలిన పనులను పూర్తిచేసి నివేదిక తక్షణం సమర్పించాలన్నారు. సిఆర్‌డిఎ అధికారులు మొదటి స్ట్రెచ్ తరహాలో మిగిలిన 4.27 కిలోమీటర్లకు సంబంధించిన ఇన్నర్‌రింగు రోడ్డు ఫేజ్-3కి సంబంధించిన 8 స్ట్రెచ్‌లకు భూ యజమానుల పూర్తి వివరాలతో కూడిన స్ట్రెచ్ డిజైన్లను సిద్ధం చేయాలన్నారు. అంతేకాకుండా మొదటి స్ట్రెచ్‌కి అంగీకారం తెలిపిన భూ యజమానులకు నిబంధనల మేరకు టిడిఆర్ బాండ్లు జారీచేయాలని ఆదేశించారు. మధ్యలో ఆమోదం తెలపని భూ యజమానుల (ఎన్‌ఆర్‌ఐ)ను గమనించి మెయిల్ ద్వారా అంగీకారం పొందాలన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పనుల పురోగతిపై ప్రతిరోజూ పర్యవేక్షణ ఉంటుందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సిఆర్‌డిఎ ఎస్‌ఇ బి శ్రీనివాస్, ఇఇ సుబ్బారావు, జాయింట్ డైరెక్టర్ బాలాజీ, డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు, టిపిఒ కామేశ్వరి, సిపి చక్రపాణి, ఎసిపి విజయభాస్కర్, లక్ష్మణస్వామి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.