గుంటూరు

రైతుసేవకు ప్రాధాన్యమివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జూలై 17: మార్కెట్ కమిటీ చైర్మన్‌లు కేవలం కుర్చీలకే పరిమితం కాక, రైతుల సేవకు అధిక ప్రాధాన్యతనివ్వాలని గుంటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం విశాఖపట్నం మార్కెట్ కమిటీ పాలకవర్గం మిర్చియార్డును సందర్శించింది. అనంతరం చైర్మన్ మన్నవతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ రైతుల ఉత్పత్తులకు దిగుబడి పెంచేందుకు రసాయన, క్రిమిసంహారక మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించే పంటలకు ప్లాట్‌ఫాంలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 22 కోట్ల రూపాయలు మార్కెట్ కమిటీ నుండి లింకు రోడ్ల నిర్మాణానికి చేపట్టామన్నారు. ప్రపంచంలో గుంటూరు మార్కెట్ యార్డు మోడల్ యార్డుగా పేర్గాంచిందన్నారు. సుమారు 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. 60 నుండి 70 వేల మంది మార్కెట్ కమిటీ వలన లబ్ధిపొందుతున్నట్లు వివరించారు. కారం మిల్లుల్లో కల్తీకారం ఉందని ప్రచారం జరిగినప్పుడు కూడా యార్డుకు సంబంధం లేకపోయినా రెవెన్యూ, సివిల్ సప్లైస్, ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌తో వారితో కలిసి దాడులు జరిపి కల్తీకారం లేకుండా కట్టుదిట్టం చేశామని తెలిపారు. రైతులకు ఇంకా మేలు చేకూర్చాలన్న సదుద్దేశంతో ఈ-నామ్ విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలిపారు. రైతు సరుకు అమ్మిన 24 గంటల్లోపే రైతులకు సొమ్ము ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తామన్నారు. విశాఖపట్నం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ జగన్నాధరావు మాట్లాడుతూ విశాఖపట్నం మార్కెట్ యార్డు 641 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 7 నియోజకవర్గాల పరిధిలో ఉంటుందన్నారు. 13 రైతు బజార్లు మార్కెట్ కమిటీ పరిధిలో ఉంటాయన్నారు. మార్కెట్ యార్డుకు వచ్చే ఆదాయం 3 కోట్ల వరకు ఉంటుందన్నారు. లింకు రోడ్లు నిర్మాణానికి 73 లక్షలు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. అభివృద్ధి చేయడం కోసం గుంటూరు మిర్చి యార్డును సందర్శించామని, ఇక్కడ రైతులకు కల్పించే సదుపాయాలు చాలా బాగున్నాయన్నారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఇక్కడ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కమిటీ వైస్ చైర్మన్ పోసపాటి బలరామభద్రరాజు, డైరెక్టర్‌లు శ్రీనివాసరాజు, పప్పు శ్రీనివాసరావు, ప్రదీప్, త్రినాధ్, జిలాని, సీతారామమూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఏపీకి మద్ధతివ్వండి
* లాలూను కలిసిని ఎంపీ గల్లా
గుంటూరు (కొత్తపేట), జూలై 17: రాష్ట్ర విభజనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. మంగళవారం బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఎంపీ లాలూ ప్రసాద్‌యాదవ్‌ను తెలుగుదేశం ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించారు. కాంగ్రెస్ రాష్ట్రానికి ఒకరకంగా అన్యాయం చేస్తే, బీజేపీ ప్రభుత్వం మరోరకంగా అన్యాయం చేస్తుందని వాపోయారు. విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా చట్టంలో పెట్టిన అంశాలను పుస్తకరూపంలో ఎంపీల బృందం లాలూకు అందజేశారు. ఎన్నికల సమయంలో బీజేపీకి ఇచ్చిన హామీలను కూడా అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్భ్రావృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలుకోసం ఆర్‌జెడి పూర్తిస్థాయిలో మద్ధతు పలకాలని కోరారు. పార్లమెంటులో ఏపీ ప్రయోజనాల కోసం తెలుగుదేశం ఎంపీలు చేసే పోరాటాని సంపూర్ణ మద్ధతు ఇవ్వాలని కోరారు. ఎంపీ లాలూ ప్రసాద్‌ను కలిసిన వారిలో గల్లా జయదేవ్‌తో పాటు రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహనరావు, కనకమేడల రవీంద్ర తదితరులున్నారు.