గుంటూరు

తెలుగు రాష్ట్రాన్ని చీల్చినపాపం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మే 15: తెలుగురాష్ట్రాన్ని చీల్చిన పాపం కాంగ్రెస్ పార్టీ పెద్దలదేనని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. మండలంలోని కోగంటివారిపాలెం, అచ్చంపేట, చింతపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత విభేదాలను విడిచి అభివృద్ధిని సహకరించాలని ఆయన కోరారు. వౌలిక వసతుల రూపకల్పనే తెలుగుదేశం ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా ఎండిఒ, తహశీల్దార్ కార్యాలయల్లో ఇంకుడుగుంత పనులను ప్రారభించారు. తహశీల్దార్ కార్యాలయంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈనెలాఖరులోగా ఉపాధి సిబ్బంది పనితీరుపై ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తామన్నారు. అనుకున్న లక్ష్యాలను ఎన్‌ఆర్‌ఇజిఎస్ సిబ్బంది చేరుకోలేకపోతున్నారన్నారు. సాక్షర భారత్ ఆధ్వర్యంలో 22 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందించారు. అనంతరం చింతపల్లి గ్రామంలో ఈద్గాకు శంకుస్థాపన చేయడంతో పాటు, 4.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే ఎంపియుపి పాఠశాల ప్రహరీగోడకు శంకుస్థాపన చేశారు. ఈ గ్రామంలోనే 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే అంతర్గత రోడ్డుకు శంకుస్థాపన, మరో 35 లక్షల అంచనా వ్యయంతో కృష్ణా పుష్కరఘాట్ పనులను ప్రారంభించారు. గ్రామానికి చెందిన సర్పంచ్ చిలకా తేరేజమ్మ, ఎంపిటిసి సభ్యులు ఎస్‌కె షాహిద్‌బీని పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 19న మినీమహానాడును అమరావతిలో ఏర్పాటు చేయనున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కోనూరులో ఇంకుడుగుంతలను ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట ఎంపిపి ఆర్ పిచ్చమ్మ, జెడ్పీటీసీ ఎన్ వెంకటేశ్వరరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పివి రామారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాసరావు, ఆర్ విశే్వశ్వరరావు, వై నాగేశ్వరరావు, ఎన్ ఆశీర్వాదం, తహశీల్దార్ సుజాత, ప్రసాద్‌బాబు, ఆంజనేయులు పాల్గొన్నారు.