గుంటూరు

మున్సిపల్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినుల ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఆగస్టు 14: స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు వక్తృత్వ పోటీలో వరుసగా మూడు బహుమతులు సాధించి తమ సత్తా చాటుకున్నారు. ‘హిరోషిమా, నాగసాకి రోజు’ అనే అంశంపై వక్తృత్వ పోటీలు రావిసాంబయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. ఏపీ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (అప్‌కాష్ట్) వారి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు ఈ పోటీలలో అసక్తిగా పాల్గొని ప్రసంగించారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికోన్నత పాఠశాలకు చెందిన పీ బిందు నాగశ్రీ, ఎస్ సుశేషాంజలి, జె శ్రీదేవి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవశం చేసుకున్నారు. బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన కన్సోలేషన్ ప్రైజులు హృతిక్‌రామ్, చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్ మధుమతిలు సాధించారు. ఈ కార్యక్రమానికి కుర్రా శ్రీనివాసరావు న్యాయనిర్ణేతగా వ్యవహించారు. పాఠశాల హెచ్‌ఎం వెలగా శరత్‌బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎం ఏడుకొండలు, అప్‌కాస్ట్ ప్రతినిధి ఏ మధుకుమార్, కో-ఆర్డినేటర్ రాయపాటి శివనాగేశ్వరావు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాలికోన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ పాఠశాల హెచ్‌ఎం వెలగా శాంతకుమారి విజేతలైన ముగ్గురు విద్యార్థినులను అభినందించారు.

వర్షాలకు 150 ఎకరాల పంట మునక
భట్టిప్రోలు, ఆగస్టు 14: మండల పరిధిలోని ఓలేరు గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సుమారు 150 ఎకరాలకు పైగా ముంపునకు గురయ్యాయని వ్యవసాయశాఖ ఏడీ ఏ భారతి తెలిపారు. మంగళవారం ఆమె స్థానిక వ్యవసాయశాఖాధికారులతో కలిసి ముంపుప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లేత ప్రాయంలో ఉన్న వెద పైరు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున వర్షపు నీటిని త్వరిత గతిన బయటకు మళ్ళించాలన్నారు. వెద పైరు దెబ్బతిన్న చోట తిరిగి నాట్లు వేసుకోవాలని ఆమె సూచించారు. అయితే వర్షం వెనుకంజ వేయగానే కలుపు, పురుగు నివారణ చర్యలు తీసుకోవాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రంలో ఏఈఓ విజయరాజు, రేపల్లె వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, ఏఈఓలు మురళి, ప్రియాంక, మాధవి, పలువురు రైతులు పాల్గొన్నారు.