గుంటూరు

దాచేపల్లి సభ జరిపి తీరతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి , ఆగస్టు 14 : అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్సార్‌సీపీని అధికార తెలుగుదేశం నాయకులు పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని అణచివేయాలని చూస్తున్నారని ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాచేపల్లి సభ త్వరలో జరిపి తీరుతామని గురజాల నియోజకవర్గ సమన్వయ కర్త కాసు మహేష్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిరికితనంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసు బలగాల సహాయంతో వాస్తవాలను కప్పిపుచ్చలేరన్నారు. గురజాల నియోజకవర్గంలోని కోనంకి, నడికుడి, కేసానుపల్లి క్వారీలలో సుమారు 300కోట్ల రూపాయల సున్నపురాయి దోపిడీకి గురైందని చెప్పారు. దానికి 7 నుండి 10 రెట్ల వరకు సుమారు 2వేల కోట్ల వరకు అపరాధ రుసుం విధించే అవకాశం ఉందన్నారు. ఈ నిధులతో పల్నాడును సస్యశ్యామలం చేయవచ్చునని కాసు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఎంత బలం ఉందో త్వరలోనే ప్రజలే తీర్పు ఇస్తారన్నారు. అంత బలగం ఉందంటున్న యరపతినేని కార్మిక నాయకుడు జంగా కృష్ణమూర్తి చేతిలో రెండు సార్లు ఏవిధంగా ఓటమికి గురయ్యారని కాసు మహేష్ ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై తాము చట్టపరంగా పోరాటం చేయడంతో పాటు ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. అక్రమ మైనింగ్‌లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ హస్తం ఉండడం వల్లే ప్రభుత్వం తగురీతిగా స్పందించడం లేదని ఆరోపించారు. త్వరలో దాచేపల్లిలో బహిరంగ సభ తేదీలను ప్రకటిస్తామని అపుడు సభను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని మహేష్ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని ప్రజాబలాన్ని ఏ ప్రభుత్వాలు కూడ అణచలేవని కాసు మహేష్ స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.