గుంటూరు

ప్రతి మహిళ ఆదిశక్తిలా మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 14: నేటి ఆధునిక సమాజంలో మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ఆదిపరాశక్తిలా మారాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆకాంక్షించారు. మంగళవారం గుంటూరు అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు ఆధ్వర్యంలో మహిళల రక్షణే ధ్యేయంగా రూపొందించిన జ్వాలా (మహిళా భద్రత మా బాధ్యత) మొబైల్ అప్లికేషన్‌ను కలెక్టర్ ఆవిష్కరించగా, లోగోను సౌత్ కోస్టల్ జోన్ ఐజి కెవివి గోపాలరావులు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తాము ఎక్కడ ఉన్నా ఈ అప్లికేషన్ ద్వారా తమ సమస్యలను తెలుపవచ్చన్నారు. స్మార్ట్ఫోన్‌లో అప్లికేషన్ డౌన్ చేసుకోవచ్చన్నారు. అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలు నేరగా అధికారులకు చేరే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫిర్యాదు సంబంధిత అధికారికి తప్ప మరెవ్వరికీ తెలియదన్నారు. స్మార్ట్ఫోన్ అంతర్జాలం అందుబాటులో లేని వారికి వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. 8333981178 నెంబర్‌కు వాట్సప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇందులో భాగంగా మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రతి పోలీసుస్టేషన్ నుండి ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్‌పి విజయారావు వివరించారు. అర్బన్ పరిధిలోని 16 పోలీసుస్టేషన్ల నుండి ఇద్దరు చొప్పున 32 మందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్‌గా వెస్ట్ డిఎస్‌పి సౌమ్యలతను నియమించినట్లు తెలిపారు. అనంతరం ‘షీ టీమ్’ సభ్యుల ర్యాలీకి జెండా ఊపి అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌పి వైటి నాయుడు, లక్ష్మీనారాయణ, రాఘవ, డిఎస్‌పిలు మూర్తి, రామకృష్ణ, సౌమ్యలత, సీతారామయ్య, రమేష్, ప్రసాద్, పాపారావు, కండే శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.