గుంటూరు

నేర నియంత్రణలో అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 14: జిల్లాలో నేర నియంత్రణకు సంబంధించిన విధుల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు చేదోడు వాదోడుగా నిలవాలని అర్బన్, రూరల్ ఎస్‌పిలు సిహెచ్ విజయారావు, సిహెచ్ వెంకట్‌లు పేర్కొన్నారు. అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు గుంటూరు అర్బన్ పరిధిలో జరిగిన నేరాలకు సంబంధించి మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించగా, రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకట్ రూరల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షించారు. అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు మాట్లాడుతూ గడిచిన మాసంలో మతవిద్వేష పూరిత గొడవలు, అల్లర్లు, పలు సంచలనాత్మక కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించడం జరిగిందని, దీనికి సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు. ఇకపై కూడా నగరంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ తరచూ నిర్వహించాలని సూచించారు. అవసరమైన కేసుల్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటుచేసి త్వరితగతిన కేసులను ఛేదించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రధానంగా హత్యల వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని స్పష్టంచేశారు. నిందితులపై రౌడీషీట్లు తెరిచే సమయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వారిపై నిఘా ఉంచి ప్రతివారం కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అర్బన్ పరిధిలో 16 వేల మొక్కలను నాటడం జరిగిందని, వీటిని సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత సిబ్బందిపై ఉందని స్పష్టంచేశారు. సమావేశంలో ఎఎస్‌పిలు వైటి నాయుడు, లక్ష్మీనారాయణ, రాఘవ, డిఎస్‌పిలు రామకృష్ణ, సౌమ్యలత, మూర్తి, శ్రీనివాసులు, ట్రాఫిక్ డి ఎస్‌పి పాపారావు తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకట్ మాట్లాడుతూ అనుమానితులను ఎప్పటికప్పుడు తనిఖీలుచేస్తూ వారిపై పూర్తి నిఘా ఉంచాలన్నారు. జైలు నుండి విడుదలైన నేరస్థుల కదలికలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. చెడునడత గల వారిపైనా, పాత నేరస్థులపైనా నిఘా ఉంచాలని, దొంగతనం కేసులో నేరస్థులను అరెస్ట్ చేసే సమయంలో వాలి వేలిముద్రల ద్వారా పాత నేరాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలిన, భద్ర వాహనాలను వినియోగించుకుంటూ దొంగతనాల నివారణకు కృషిచేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్‌పిలు ఎస్ వరదరాజు, ఎం వెంకటేశ్వర్లు, డిఎస్‌పిలు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ లబ్ధికోసమే ఎమ్మెల్యే యరపతినేనిపై వైసీపీ నాయకుల ధ్వజం
వినుకొండ, ఆగస్టు 14: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వైసీపీ నాయకులు ఓ పథకం ప్రకారం దురుద్దేశ్యంతో, బురద చల్లేందుకు అక్రమ మైనింగ్‌ల భూముల పరిశీలనా కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కాంగ్రెస్ సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాచవరం ప్రాంతంలో సరస్వతీ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో పేదల భూములను జగన్ లాక్కొని సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని, భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని జీవీ విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. వైసీపీ నాయకులు పినె్నల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు ఆ ప్రాంత రైతులు పండించిన మిర్చి, పత్తి పంటలను సైతం నాశనం చేసి, రైతులను భయభ్రాంతులను చేశారని ఆరోపించారు. పేద రైతులకు యరపతినేని అండగా ఉన్నారనే అక్కసుతో అక్రమ మైనింగ్ పేరుతో వైసీపీ నాయకులు బురదజల్లే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి హాయాంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన బయ్యారం గనుల భూములను అల్లుడు అనిల్‌కుమార్‌కు ధారాదత్తం చేశాడని అన్నారు. రాజకీయ లబ్ధికోసం వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని నాగేశ్వరరావు, జడ్‌పీటీసీ రవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.