గుంటూరు

బారతరత్న అటల్‌జీకి ఘన నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), ఆగస్టు 17: దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిని దేశ ప్రజలు జీర్ణించుకోలేని సంకట స్థితిలో ఉన్నారని రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు.
శుక్రవారం పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంధ సంస్థలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో వాజ్‌పేయి సంతాప దినం పాటించారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో శంకర్‌విలాస్, జిన్నాటవర్, నెహ్రూనగర్, మారుతి నగర్ ప్రాంతాల్లో వాజ్‌పేయి నిలువెత్తు ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె కోటేశ్వరరావు మాట్లాడుతూ వాజ్‌పేయి మరణం బీజేపీతో పాటు యావత్తు దేశ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారన్నారు. దేశఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఆయనకే దక్కిందన్నారు. 1995వ సంవత్సరంలో ప్రోక్రాన్ అణుపరీక్ష నిర్వహించి ప్రపంచ పఠంలో భారత్ సత్తాను మరోమారు చాటారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, భజరంగ్ రామకృష్ణ, సురేష్ జైన్, సంగీతం రవికుమార్, ఓరుగంటి ఆదినారాయణ, పాలపాటి రవికుమార్, కిడాంబి దేవరాజన్, వెలగలేటి గంగాధర్, కెవి సుబ్బారావు, ఆలూరి కోటేశ్వరరావు, కస్తూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సంస్థ ఆధ్వర్యంలో..
అవగాహన సంస్థ ఆధ్వర్యంలో అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం వాజ్‌పేయి సంతాప సభ సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. సభలో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు ముప్పాళ్ల హనుమంతరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీమన్నారాయాణలు మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో వాజ్‌పేయి పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా మొక్కవోని దీక్షతో పదవికి రాజీనామా చేశారే తప్ప అధికారం కోసం అరువులు చాచలేదన్నారు. నేటి తరం రాజకీయ నాయకులకు వాజ్‌పేయి ఆదర్శప్రాయులన్నారు. ఈ కార్యక్రమంలో ఇ చంద్రయ్య, సుబ్బారెడ్డి, జయకుమార్, ఆర్‌వి సింగరయ్య, గూడవల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని అటల్‌జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అమ్ ఆద్మీ పార్టీ నివాళి..
రాజకీయ పార్టీలకు అతీతంగా, దేశాభివృద్ధే ఏకైక లక్ష్యంగా సుపరిపాలన అందించిన వాజ్‌పేయికి అమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఒ సమావేశ మందిరంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి టి సేవాకుమార్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.