గుంటూరు

డంపింగ్ యార్డ్ తొలగించాలని ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, సెప్టెంబర్ 17: డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన, పొగ వల్ల 27, 29వ వార్డు ప్రజలు, గర్భిణులు, పిల్లలు అనేక వ్యాధులతో సమస్యలు ఎదుర్కొంటున్నారని, గత 5 సంవత్సరాలుగా ఫిర్యాదు చేస్తున్నా సంబంధింత అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తూ ఆయా వార్డు ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మున్సిపల్ చెత్త బండి ఇటు రావడానికి విల్లేదంటూ... కందకం తవ్వేశారు. స్పష్టమైనా హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుండి కదిలేదిలేదని భీష్మించారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్, పట్టణ సిఐ శరత్‌బాబు సమస్య పరిష్కారానికి శాంతియుతంగా అధికారులతో చర్చించాలని సూచించారు. నివాసాలను ఆనుకొనివున్న డంపింగ్‌యార్డును తక్షణమే మార్చాలని ఎప్పటి నుండో విన్నవింస్తుంటే దానిచుట్టూ లక్షల రూపాయలను వెచ్చించి ప్రహరీ నిర్మాణానికి నిధులు కేటాయించడమేమిటని, ప్రజల గోడు పట్టదా అంటూ అధికారులను అక్కడి నివాసితులు నిలదీశారు. చేసేదిలేక అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

పట్టణంలో ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు
వినుకొండ, సెప్టెంబర్ 17: పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాల్లోని వినాయక విగ్రహాలను ఐదోరోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, నిమజ్జనానికి తరలించారు. సమీపంలోని కాలువల్లో నిమజ్జనం చేసేందుకు డప్పువాయిద్యాలతో వినాయకుడిని తరలించారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కూకటివేళ్లతో కూలిన శతాధిక చింతచెట్టు
వినుకొండ రూరల్, సెప్టెంబర్ 17: మండలంలోని విఠంరాజుపల్లి గ్రామ సమీపంలో షిరిడిసాయి మందిరం ఎదురుగా ఉన్న నరరావుపేట రహదారిపై భారీ వృక్షం కూలిపడింది. వంద సంవత్సరాలు పైబడిన చింతపెట్టు సోమవారం సాయంత్రం వీచిన భారీ గాలుల ధాటికి కూకటివేళ్లతో కూలి రోడ్డుపై అడ్డంగా పడింది. సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే మండలంలోని పలు వృక్షాలు భారీ ఈదురుగాలుల ధాటికి నేలకూలినట్లు తెలుస్తోంది.

నమ్మిన సిద్ధాంతాలను ఆచరించిన వావిలాల
గుంటూరు (పట్నంబజారు), సెప్టెంబర్ 17: తాను నమ్మిన సిద్ధాంతాల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ధన్యజీవి అని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. సోమవారం అరండ్‌పేటలోని సంస్థ కార్యాలయంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఆర్‌వి సింగరయ్య అధ్యక్షతన జరిగిన జయంతి సభలో సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడారు. 13 సంవత్సరాల వయస్సులో బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ ఉపన్యాసాల పట్ల ప్రభావితుడై, స్వాతంత్య్రోద్యమంలో వావిలాల పాల్గొన్నారన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యావేత్త ఇ చంద్రయ్య, పి నరసింహులు, కె జయకుమార్, జాషువా, ఘనశ్యామాచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.