గుంటూరు

అపాచీ భూమలపై ఓ నేత కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 17: అపాచీ బూట్ల కంపెనీకి గతంలో కేటాయించిన 56 ఎకరాల భూమిని కబ్జాచేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు పావులు కదుపుతున్నారు.. ఈ కంపెనీ శాఖ ఏర్పాటుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పొత్తూరు వద్ద భూములు కేటాయించింది. అయితే నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు చేరువలో ఉన్నందున అక్కడ కంపెనీ స్థాపించలేమని అపాచీ యాజమాన్యం అప్పట్లో తేల్చిచెప్పింది. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఏళ్లు గడవటంతో ప్రస్తుతం సదరు భూమిపై కనే్నసిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన అనచురులు.. సన్నిహితులకు బినామీ పేర్లతో పట్టాలు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు రెవెన్యూ వర్గాల్లో గుప్పుమంది. ఇందుకు ఒకరిద్దరు రెవెన్యూ అధికారులు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో ఆరు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇందులో ఐటి, సోలార్ పార్కు, టెక్స్‌టైల్ పార్కులు ఉన్నాయి. ఏపిఐఐసి భూ కేటాయింపులు జరిపింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతం కావడంతో ఎక్కడి భూములు అక్కడ చేతులు మారుతున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గం వంకాయలపాడు, చేబ్రోలు మండలం వడ్లమూడి, గురజాల ప్రాంతాల్లో భారీ పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయింపులు జరిపారు. అయితే అపాచీ మినహా మిగిలిన భూములన్నీ ప్రభుత్వ అధీనంలో ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ అసైన్డ్ భూముల లెక్కలు తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో అసైన్డ్, బంజరు, అటవీ, పోరంబోకు భూముల వివరాలు తెరపైకి వస్తున్నాయి. అపాచీ భూములు చేజారిపోక ముందే అధికార యంత్రాంగం మేలుకోవాల్సిన అవసరం ఉందనేది సుస్పష్టం.