గుంటూరు

మినీమహానాడు ఏర్పాట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 20: నగరంలోని శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో ఈనెల 22న జరగనున్న జిల్లా మినీమహానాడు కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు. మహానాడుకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలకు వాహనాల ఏర్పాటు, భోజన వసతులు, గ్రౌండ్‌లో ఏర్పాటుచేయాల్సిన భారికేడ్లు, టెంట్‌లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రతియేటా నిర్వహించే పార్టీ మినీమహానాడు పండుగ్గా జరుపుకోవడం తెలుగుతమ్ముళ్ల ఆనవాయితీ అన్నారు. 22వ తేదీన ఉదయం 9 గంటలకు ఎన్‌టి రామారావుకు నివాళులర్పించి సాయంత్రం 5 గంటల నుండి మహానాడు నిర్వహిస్తామన్నారు. మహానాడుకు జిల్లా నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశమున్నందున ఏర్పాట్లను తగు రీతిలో చేయాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్, అర్బన్ పార్టీ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్, పార్టీ నాయకులు లాల్‌వజీర్, కంచర్ల శివరామయ్య, ఎస్ శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్, చంద్రగిరి ఏడుకొండలు, వట్టికూటి హర్షవర్ధన్, మహ్మద్ ఇబ్రహిం, షేక్ షౌకత్, మన్నవ కోటేశ్వరరావు తదితరులున్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జిల్లా మినీమహానాడుకు గుంటూరు నగరం ముస్తాబైంది. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేసే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు.