గుంటూరు

శరనంటిమమ్మ-కరుణించవమ్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), అక్టోబర్ 14: ‘సంప్రదాయ వస్త్రాలు ధరించి, దీక్షాధారులైన భక్తజనం శరన్నవరాత్రి మహోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం తమ సమీప ప్రాంతాల్లో గల దేవీ ఆరాధనా మందిరాలకు ప్రభాతవేళ నుంచి, రాత్రి వరకు వేలాదిగా తమ కుటుంబాలతో సహా తరలివచ్చి, శరనంటిమమ్మా - కరుణించవమ్మా, మమ్ము సదా కాపాడవమ్మా అంటూ భక్తిగీతాలతో కొనియాడారు. గుంటూరు నగరంలోని పాత గుంటూరు మొదలుకుని ఇటు నల్లపాడు రోడ్డు, అటు స్వర్ణ్భాతినగర్, గోరంట్ల, అటువైపున బుడంపాడు వరకు అన్ని ప్రాంతాల్లో గల ఆలయాలు, దేవస్థానాలను భక్తులు విశేష సంఖ్యలో దర్శించారు. అనేకచోట్ల శ్రీమాతకు నివేదించడానికి స్వయంగా తమ గృహాలలో ప్రసాదాలను తయారు చేసుకుని అర్చక స్వాముల ద్వారా కైంకర్యానికి వినియోగించడం కన్పించింది. త్రిలోక పావని, సమస్త అసురసంహారిణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, అనంత కరుణాస్వరూపిని నీవుగాక మరెవరూ లేరని ఆధ్యాత్మిక చింతనాపరులు శైలపుత్రిని ప్రస్తుతించారు. ఆలయాలలో యథావిధిగా లోకకళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ సమస్త దుష్టశక్తులు పరిహారం కావాలని రాష్ట్రం, దేశం, సుభిక్షంగా ఉండాలన్న ముఖ్య సంకల్పంతో ఆయా దేవస్థానాల వారు, ఉత్సవ సంఘాల ప్రతినిధులు నిర్వహిస్తున్న చండీ, లలిత, శక్తి ఆవాహన హోమాలు 5వ నాటికి చేరుకున్నాయి. ఏ రోజుకారోజు హోమాలు పూర్తికాగానే పూర్ణాహుతి గావిస్తున్నారు. ఇలా ఉండగా శృంగేరీ శారదాపీఠానికి చెందిన శారదా పరమేశ్వరి దేవస్థానంలో జగద్గురు ప్రవచన మందిర వేదికపై ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కాకినాడకు చెందిన విదుషీమణి పెద్దాడ సూర్యకుమారి పలు భక్తిగీతాలను శారదాంబ వైభవాన్ని కొనియాడుతూ సంకీర్తనలు మధురంగా గానం చేశారు. పీఠ ప్రతినిధి పోలిశెట్టి హరిప్రసాదరావు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు శారదాంబను దర్శించుకున్నారు.

జనసేన, సీపీఐతో కలిసి ప్రజాసమస్యలపై ఉద్యమం: మధు
మంగళగిరి, అక్టోబర్ 14: భవిష్యత్తులో జనసేన పార్టీ సీపీఐలతో కలిసి ప్రజాసమస్యలపై సీపీఎం ఉద్యమిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. మండల పరిధిలోని చినకాకాని గ్రామంలో ఆదివారం జొన్నా శివశంకర్ అధ్యక్షతన జరిగిన మంగళగిరి నియోజకవర్గ సీపీఎం విస్తృత సమావేశంలో మధు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచలేదని, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తి అవసరమని, ఆ క్రమంలోనే సీపీఎం, సీపీఐ, జనసేనలు కలిసి పనిచేయనున్నాయని అన్నారు. నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని తీసుకున్నప్పుడు రైతుల పక్షాన పోరాడామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీపీఎం పోరాడినప్పుడు ప్రత్యేక హోదా సంజీవనా అన్న చంద్రబాబు సైతం నేడు హోదా కోసం మాట్లాడుతున్నారని మధు అన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వరంగ పెట్టుబడులు తగ్గిపోవడంతో ఆ రంగం సంక్షోభానికి గురై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పాలకులకు పట్టడం లేదని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి విస్మరిస్తున్నారని మధు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడీదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మనదేశంలోని పాలకులు వారికి రాయితీలు కట్టబెట్టే పనిలో నిమగ్న మయ్యారని మధు ధ్వజమెత్తారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీ కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సీహెచ్ బాబూరావు, జేవీ రాఘవులు, వై గంగాధరరావు, ఎం రవి, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, మొసలి పకీరయ్య, భీమిరెడ్డి కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.