గుంటూరు

ఆహార భద్రతలో భాగంగా పేదలకు పౌష్ఠికాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 15: ఆహార భద్రతలో భాగంగా ఐదు కోట్ల మంది పేదలకు పౌష్ఠికాహారాన్ని అందించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్ తెలిపారు. పేదలకు ఆహార భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు గురువారం అర్బన్ పరిధిలోని రేషన్‌బియ్యం గోడౌన్, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం, స్ర్తి శిశు సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రధానమంత్రి మాతృత్వయోజన పథకం రాష్ట్రంలో అమలవుతున్న తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ తగు సూచనలు చేస్తున్నామన్నారు. ఇటీవల ప్రభుత్వం జీవో 9ని విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని, టీమ్‌కు డిఎస్‌ఒ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. ఈ టీమ్‌లు బియ్యం నాణ్యత, సరైన తూకం, రీసైక్లింగ్ ఆఫ్ రైస్‌ను నిరంతరం తనిఖీ చేస్తాయన్నారు. రాష్ట్రం మొత్తమీద 17.90 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు రేషన్ తీసుకోనందున ప్రతి నెలా 2వ వారంలో ఇంటింటికీ తిరిగి రేషన్ అందజేసే విషయమై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 35 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్ఠికాహారం అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గతంలో జీవో 8 పబ్లిక్ సిస్టమ్ కంట్రోల్ యాక్ట్ ఉండేదని, ఆ జీవో కొత్తగా కంట్రోల్ ఆర్డర్ 2018 తెచ్చామన్నారు. రైస్‌మిల్లర్లు, చౌకధరల డిపో డీలర్లు కంట్రోల్ పాయింట్స్ వద్ద, ట్రాన్స్‌పోర్ట్‌లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో భాగంగా తొలుత బస్టాండ్ వద్దనున్న సివిల్ సప్లై గోడౌన్‌ను తనిఖీ చేశారు. అనంతరం అలీనగర్‌లో అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రంలో 45 మందికి గాను 12 మంది మాత్రమే చిన్నారులు ఉన్నారని, 50 గ్రాముల బరువు ఉండాల్సిన కోడిగుడ్డు 40 నుండి 45 గ్రాముల మధ్య ఉందని, వీటిపై తనిఖీ చేయాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. పుష్పరాజ్ వెంట అదనపు జాయింట్ కలెక్టర్ అంబేద్కర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్, ఫుడ్ కమిషన్ మెంబర్ సెక్రటరి, శిశు సంక్షేమ శాఖ పిడి తదితరులు పాల్గొన్నారు.

పుస్తక ప్రదర్శనకు అనూహ్య స్పందన
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 15: 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గుంటూరులోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు వారోత్సవాల్లో భాగంగా గురువారం ఏసీ కళాశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనకు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన లభించింది. గెజిటెడ్ గ్రంథపాలకుడు కె కుమారరాజా ఆధ్వర్యంలో ఈపుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ పుస్తక ప్రదర్శనలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, సెలం, సర్ధార్ పటేల్, డాక్టర్ అంబేద్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్రలతోపాటు మరెన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ పుస్తకాలను పఠించడం వలన విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని కుమారరాజా తెలిపారు. అలాగే గ్రేడ్-1 గ్రంథ పాలకుడు బుర్రి కుమార రాజా మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా మానసిక వికాసం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకులు సుధాకర్, ద్రాక్షావలి, సి శ్రీనివాసరెడ్డి, జి శివప్రసాద్, రహంతుల్లా, ఆదిలక్ష్మి, శ్రీలక్ష్మి, కె భారతి, పలువురు పాల్గొన్నారు.

ఉద్యానవన పంటల సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలి
కాకుమాను, నవంబర్ 15: ఉద్యానవన పంటల సాగులో సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అశోక్ అన్నారు. మండల పరిధిలోని కొమ్మూరు, పెద్దివారిపాలెం గ్రామాల్లో ఉద్యానవన పంటలను పరిశీలించి సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వినియోగించాలని సూచించారు. పలు తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. రైతులకు ప్రచారరథం సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిఇఒలు వంశీ, సూర్యతేజ, ప్రణీత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.