గుంటూరు

సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచర్ల, నవంబర్ 15: రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గురువారం మండలంలోని అన్నవరం, తంగెడమల్లి మేజర్ కాలువల పరిధిలోని పొలాలను ఆయన పరిశీలించారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో ఎన్‌ఎస్‌పీ అధికారులు, రైతులతో స్పీకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారాబందీ విధానాన్ని ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు. నీటి కోసం రాత్రింబవళ్ళు కాలువ వెంట తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నామని రైతులు స్పీకర్‌కు వివరించారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తిందన్నారు. దీంతో వారాబందీ విధానాన్ని అమలుచేసి, రైతులకు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వారాబందీ విధానాన్ని ఎత్తివేస్తే రైతులకు నీరు అందదన్నారు. తంగెడుమల్లి, అన్నవరం మేజర్ కాలువలకు ప్రస్తుతం విడులవుతున్న నీటి పరిమాణాన్ని పెంచాలని ఎన్‌ఎస్‌పీ అధికారులను ఆదేశించారు. చివరి భూముల రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా నీరు అందే విధంగా చూడాలన్నారు. రైతులు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో నీటి విడుదల గురించి మాట్లాడానన్నారు. రైతులకు సాగునీరు సక్రమంగా అందించేందుకు కాలువలపై ఉన్న హైడల్ ప్రాజెక్టులను తాత్కాలికంగా మూసివేయిస్తామన్నారు. నీటి సరఫరా విషయమై ఎన్‌ఎస్‌పీ శాఖలో రిటైరైన లస్కర్లను విధుల్లోకి తీసుకుని, సక్రమంగా నీటి సరఫరా జరిగే విధంగా చూడాలన్నారు. ప్రస్తుతం వస్తున్న నీటిని సుబాబుల్ తోటలకు పెట్టవద్దన్నారు. నూతనంగా వరి నాట్లు కూడా వేయవద్దని సూచించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులతో సాగునీటి పంపిణీకి అధికారులు టీంలను వేసి, నీరు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కోడెల శివరాం, యార్డు చైర్మన్ లింగా వెంకటేశ్వర్లు, ఎంపీపీ రామారావు, డీసీ చైర్మన్లు కొలికొండ కొండలు, ఆలపాటి వెంకట కృష్ణ, సాగునీటి సంఘం అధ్యక్షుడు వెలగటూరి వెంకటనారాయణ, చిరుమామిళ్ళ బ్రహ్మయ్య, శాఖమూరి రామ్మూర్తి, కోనేటి శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌పీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.