గుంటూరు

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 15: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నూతన యువ సిబ్బంది ముందుకు వెళ్ళాలని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. నూతనంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఎస్‌ఐలతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్న ఎస్‌ఐలకు ఆయన దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు మాట్లాడుతు పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడాలని, కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా 12మంది మహిళా ఎస్‌ఐలు డైరెక్ట్‌గా రావడం చాలా శుభపరిణామం అన్నారు. సివిల్ వివాదాలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి వివరంగా అర్ధమయ్యేలా చెప్పాలని సూచించారు. ఆర్థిక నేరాలు జరిగినప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని, ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్ ద్వారా వాటిని నియంత్రిచవచ్చన్నారు. మహిళా ఎస్‌ఐలు కాలేజీలకు స్కూల్స్‌కు వెళ్లి విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవలన్నారు. పోలీసు రికార్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. అదే విధంగా మహిళలకు సంబంధించిన ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని వాటిని పరిష్కరించడంలో సమర్దవంతంగా పనిచేయాలని రాజశేఖరబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

నర్సుల రెగ్యూలర్ పోస్టులకు అనుమతులు ఇవ్వాలి
* వైద్య విద్య సంచాలకులను కోరిన నర్సింగ్ అడహక్ కమిటీ సభ్యులు
గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 15: గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో శాశ్వత ప్రాతిపాదికన నియమించనున్న నర్సుల పోస్టులకు అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని ఎపి నర్సుల అడహక్ కమిటీ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ బాబ్జీని కోరారు. గురువారం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన అడహక్ కమిటీ సభ్యులు విజయవాడలోని డిఎంఈ కార్యాలయంలో డాక్టర్ బాబ్జీని కలసి వైద్యశాలలో నూతనంగా ఏర్పడే గైనకాలజీ విభాగంలో శాశ్వత ప్రాతిపాదికన నియమించనున్న 9 హెడ్ నర్సుల పోస్టులు, 21 స్ట్ఫా నర్సుల పోస్టులు మంజూరు అయ్యాయని వాటిని మంజూరు చేసేందుకు రిజనల్ డైరెక్టర్ సానుకూలంగా ఉన్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పనిచేస్తున్న నర్సులకు వెయిటేజి కల్పించి వారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని నర్సింగ్ సంఘ ప్రతినిధులు కోరారు. అనంతరం ఆయనకు వినతిపత్రం అందించారు. నర్సుల పోస్టులను భర్తీ చేయడానికి డిఎంఈ సానుకూలంగా స్పందిచారని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడహక్ కమిటీ సభ్యులు ఆవుల విజయకుమారి, వెల్లంపల్లి పద్మజ, హేమకళ్యాణి, తుమ్మల భానులక్ష్మి, విశ్వశాంతి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.