గుంటూరు

మోగనున్న నర్సుల ఎన్నికల నగారా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 16: వైద్య ఆరోగ్యశాఖలో అత్యంత కీలకమైన ఏపి గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్‌కు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగనుంది. గత సంవత్సర కాలంగా ఏసీ నర్సుల సంఘం పదవి కాలం ముగియడంతో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని నర్సింగ్ అసోసియేషన్ నాయకులు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని యూనిట్లకు ఓకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఈనెల 19న గుంటూరు నగరంలోని ఎన్జీవో సమావేశ మందిరంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం సంఘం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యురాలు వెల్లంపల్లి పద్మజ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని నర్సుల సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అడహక్ కమిటీ నిర్ణయించిందని ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని యూనిట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు సంబంధించిన సాద్యాసాధ్యాల గురించి ఈనెల 19న ఎన్జీవో హాల్‌లో జిల్లావ్యాప్తంగా ఉన్న నర్సులు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లాలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల, జ్వరాల ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏవీవీపీ ఆసుపత్రులలో పనిచేస్తున్న నర్సులు ఈ ఎస్‌ఐ ఆసుపత్రులలో పనిచేస్తున్న నర్సులందరూ తప్పకుండా హాజరుకావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యులు ఆవుల విజయకుమారిలు పాల్గొన్నారు.

గ్రంథాలయోద్యమంలో మహనీయుల పాత్ర మరువలేనిది
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 16: గ్రంథాలయ ఉద్యమంలో మహనీయుల పాత్ర మరువలేనిదని గుంటూరు ప్రాంతీయ గెజిటెడ్ గ్రంథ పాలకుడు కె కుమారరాజా పేర్కొన్నారు. 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శుక్రవారం గ్రంథాలయంలో గ్రంథాలయోద్యమంలో కీలకపాత్ర వహించిన యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె కుమారరాజా మాట్లాడుతూ గ్రంథాలయాల స్థాపనకు ఎస్‌ఆర్ రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్య వంటి మహనీయులెందరో జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. తమ ఆస్థులను సైతం అమ్ముకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేశారన్నారు. గ్రేడ్-1 గ్రంథ పాలకుడు బుర్రి కుమారరాజా మాట్లాడుతూ గ్రంథాలయాల వ్యవస్థ ఉన్నంతకాలం మహనీయుల త్యాగాలను మరువలేమన్నారు. మరో గ్రంథ పాలకుడు ఎం ఉమర్‌పాషా మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో విజ్ఞాన భాండాగారాలు ప్రముఖ పాత్ర వహించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకులు ఎంవి రమణ, కోండ్రు సుధాకర్, రహంతుల్లా, శాంతకుమారి, ఎ నాగేశ్వరరావు, ఆదిలక్ష్మి, బాలకోటేశ్వరరావు, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.