గుంటూరు

మేజర్‌కాల్వ చివరి భూములకు 24 గంటల్లో నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకుమాను, నవంబర్ 16: కాకుమాను మేజర్ కాల్వ కింది వరిపొలాలకు మరో 24 గంటల్లో సాగునీరు అందిస్తామని ఎన్‌ఎస్‌పి కుడికాల్వ ఎస్‌ఇ గంగరాజు తెలిపారు. మండల కేంద్రం కాకుమానులో నీరులేక ఎండిపోతున్న వరి పొలాలను ఆయన పరిశీలించారు. బీటలువారిన పొలాలను పరిశీలించి తప్పక నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్‌ఎస్‌పి కుడికాల్వ ద్వారా వరి రైతులకు చివరివరకు నీరు అందించేలా ప్రణాళికలు తయారుచేసి ఆ కమిటీని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఆయన వెంట మండల తహశీల్దార్ సాయిప్రసాద్, ఎంపీపీ నక్కల శైలజ, ఎండీవో బ్రహ్మయ్య, ఇరిగేషన్ ఇఇ శంకరరావు, డిఇ ఆదిశేషయ్య, బాపట్ల ఏడిఎ ఎవిఎస్ శాస్ర్తీ, మండల వ్యవసాయ అధికారి అంకారావు, రైతులు ఉన్నారు.

వృథా చేసిన ప్రజాధనాన్ని కట్టిస్తాం : ఆర్కే
మంగళగిరి, నవంబర్ 16: మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామ జడ్‌పీ హైస్కూల్ ఆటస్థలంలో కంపోస్ట్‌యార్డు నిర్మించడం సరికాదని, ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నిర్మాణం చేయవద్దని కోర్టు స్టే ఇచ్చిందని, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా 10 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిన అధికారుల నుంచి ఆ ధనాన్ని కట్టిస్తామని స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. శుక్రవారం ఆత్మకూరు జడ్‌పీ హైస్కూల్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కంపోస్ట్‌యార్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ గ్రామస్తుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నివాస గృహాల మధ్య అధికారులు అనాలోచితంగా 10 లక్షల రూపాయలను వృథా చేశారని అన్నారు. 10 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకుంటే ఎంతో బాగుండేదని ఆయనన్నారు. కంపోస్ట్‌యార్డుకు వేరే సర్వే నెంబరులో కేటాయించిన స్థలంలో మట్టిని తవ్వుకుని గుంటగా మార్చినప్పటికీ అధికారులు మట్టిమాఫియాకు భయపడి పట్టించుకోలేదని, జడ్‌పీ హైస్కూల్ క్రీడా మైదానంలో మాత్రం డంపింగ్‌యార్డుకు పూనుకున్నారని, కంపోస్ట్‌యార్డుకు తాను వ్యతిరేకం కాదని, ఊరికి దూరంగా నిర్మించి ఉంటే ప్రజలందరూ సంతోషించే వారని ఆర్కే అన్నారు. మాజీ సర్పంచ్ బొమ్ము శివరామిరెడ్డి, వైసీపీ నేతలు పచ్చల శ్యాంబాబు, ఎం నాగేశ్వరరావు, జి జగన్మోహనరావు, బీ సాంబిరెడ్డి పాల్గొన్నారు.