గుంటూరు

పెద్దాసుపత్రిలో రక్తపరీక్షకు దిక్కులేదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 16: ఆరు జిల్లాల నుంచి రోగుల రాక.. రాజధాని ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలలో రోగులకు రక్తపరీక్షలకు దిక్కులేకుండా పోయింది. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని అత్యావసర చికిత్స విభాగంలో గత రెండు రోజుల నుంచి రక్తపరీక్షల పరికరాలు లేక రోగులకు రక్తపరీక్షలు నిర్వహించడం లేదు. పట్టించుకోవాల్సిన అధికారులు అటువైపు కనె్నతి చూడకపోవడంతో రోగుల పాలిట శాపంగా..ప్రైవేట్ ల్యాబ్‌ల పాలిటవరంగా మారింది. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో గత రెండు రోజుల నుంచి అత్యావసర చికిత్స విభాగంలోని రక్తపరీక్షల ల్యాబ్‌లో రోగ నిర్ధారణకు అవసరమైన రక్తపరీక్షలు నిర్వహించడంలేదు. కేవలం రెండు రకాల రక్త పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉండటంతో అవి కూడా సామన్య రోగులకు అవసరమైనవి కాకపోవడంతో రోగుల బాధ వర్ణణాతీతం. అసలే జిల్లాలో స్వైన్‌ప్లూ, డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాన ఆసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం గమనార్హం..
ప్రస్తుతం ఆసుపత్రిలో నిలిచిన రోగ నిర్ధారణ పరీక్షలు ఇవే..
ర్యాండమ్ బ్లడ్ షుగర్, సిరమ్ క్రియాటిన్, బ్లడ్ యూరియా, సిరమ్ బిల్‌రూబెన్ (డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్) ఎస్‌జిఓటి, ఎస్‌జిపిటి, ఎఎల్‌పి, సిరమ్ టోటల్ ప్రోటీన్, సిరమ్ అబ్‌డామన్, హెచ్‌సి03, కేప్లస్, సిఎ ప్లస్, హెచ్‌ఐవి, హెచ్‌సివి, హెచ్‌బిఎస్‌ఎజి, ఇవన్ని ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యంత కీలకమైన, కిడ్నీ, జ్వరం, హెచ్‌ఐవి రోగాలకు సంబంధించిన పరీక్షా పరికరాలను సైతం అందుబాటులో ఉంచుకోవడంలో అధికారలు విఫలమయ్యారు. వాస్తవంగా ఆరు నెలలకు సరిపడా మందులు, రక్తపరీక్షలు అందుబాటులోకి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రోగుల బాధలు పట్టకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల రోగులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వస్తే ఏం సేవలు అందుతున్నాయో కూడా అర్ధమయ్యే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. ఆసుపత్రిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటీ కొనుక్కునే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కనీసం రక్త పరీక్షలకు ఉపమోగించే బాటిల్స్ కూడా బయట కొనుక్కోవాల్సి రావడం దౌర్భాగ్యమంటూ ఈసడించుకుంటున్నారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చేవారికి సరైన సౌకర్యాలు కూడా లేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అత్యవసర విభాగంలో రోగ నిర్ధారణ పరీక్షలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
రెండ్రోజుల్లో అందుబాటులోకి : డాక్టర్ రాజునాయుడు
రెండు రోజుల నుంచి రోగ నిర్ధారణ పరీక్షలు జరగకపోవడం వాస్తవమే, రానున్న రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పరీక్షలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.. రోగ నిర్ధారణ పరీక్షలు అవసరమైన వారికి డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్య సేవ పథకం ద్వారా రక్తపరీక్షలు నిర్వహిస్తాం.. తద్వారా రోగులకు ఎటువంటి ఖర్చు ఉండదని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు తెలిపారు.