గుంటూరు

ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాదెండ్ల, నవంబర్ 16: రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోకుండా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు శుక్రవారం ఆదేశించారు. తుర్లపాడు మేజర్, పెదనందిపాడు మేజర్ కాలువలోని నీటి సామర్ధ్యాన్ని శుక్రవారం సందర్శించారు. అధికారులతో మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం లేకుండా ఈరెండు కాలువలకు సమానంగా నీటిని విడుదల చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందన్నారు. రైతులు ఉన్న నీటితో పొలాలను తడుపుకోవాలని, వృధా చేయవద్దన్నారు. పైన ఉన్న రైతులు ఎగువన ఉన్న రైతులకు సక్రమంగా నీరు పోకుండా అడ్డుకట్టలు వేయవద్దన్నారు. ఎగువ నుండి నాగార్జునసాగర్‌కు నీరు రాకపోవడంతో నీటి మట్టం తగ్గిందన్నారు. రైతులు సక్రమంగా నీటిని సద్వినియోగపరుచుకోవాలన్నారు. మంత్రి వెంట డీఈ నరేంద్ర, ఈఈ మొహిద్దీన్, సంబంధిత అధికారులు ఉన్నారు.

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
* రూరల్ పరిధిలో 15 మంది ఏఎస్‌ఐలకు పదోన్నతి
* నియామక ఉత్తర్వులు అందజేసిన రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు
గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 16: క్రమశిక్షణతో విధులు సమర్ధవంతంగా నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలని రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. శుక్రవారం రూరల్ పరిధిలో ఏఎస్‌ఐలుగా ఉన్న 15 మందికి సివిల్ ఎస్‌ఐలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌ఐలుగా పదోన్నతులు పొందిన వారికి నియామక ఉత్తర్వులు రాజశేఖరబాబు అందజేశారు. శాఖాపరంగా తప్పులు జరగకుండా జాగ్రత్తలు వహించాలని ఎస్‌పి సూచించారు. అదేవిధంగా శాంతిభద్రతల పర్యవేక్షణలో లోటుపాట్లు జరగకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు. పదోన్నతి పొందిన 15 మందికి స్టేషన్లు కేటాయించారు. విఆర్‌లో ఉన్న చంద్రశేఖరరావును తూళ్లూరు పోలీసుస్టేషన్‌కు, శివ ఆంజనేయులను పెదనందిపాడుకు, ఫ్రాన్సిస్‌ను పెదనందిపాడుకు, రామలింగరాజును పెదకాకానికి, శ్రీనివాసరావును పెదకాకాని పోలీసుస్టేషన్లు కేటాయించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని ఎస్పీ సూచించారు.