గుంటూరు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, నవంబర్ 17: స్థానిక 21వ వార్డులో శనివారం జరిగిన నగర వికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్రకుమార్ ఆ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ వార్డు ప్రజలు తన దృష్టికి తెచ్చిన డ్రైనేజీ సమస్యను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 21వ వార్డులో రూ.35.84 లక్షల వ్యయంతో 5 అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎన్‌టిఆర్ నగర్‌లో 67 మందికి ఇళ్లు కేటాయించామన్నారు. 134 మందికి రూ.1.36 లక్షల పింఛన్లు మంజూరు, 34 గ్రూపులకు రూ.2.16 కోట్ల మేరకు బ్యాంకు లింకేజీరుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు జీవనభృతి కల్పించేందుకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం సహకరిస్తుందని ధూళిపాళ్ల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ హేమలత, వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు, యార్డు చైర్మన్ ప్రభాకరరావు, మాజీ చైర్మన్ మాదల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు బొర్రు రామారావు, పిఎ ఖాన్, లక్ష్మీనారాయణ చౌదరి, మున్సిపల్ కమిషనర్ అన్నం వెంకటేశ్వరరావు, డిఇ సాంబశివరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై ర్యాలీ...
అచ్చంపేట, నవంబర్ 17: రోడ్డు భద్రత సూచనలను పాటించి ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని ఎస్‌ఐ కిరణ్ కోరారు. అచ్చంపేటలో శనివారం రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జెడ్పీ హెచ్‌ఎం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు శీలం యలమందయ్య, ఎఎస్‌ఐ నాయక్, జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.