గుంటూరు

సమన్వయంతో ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, నవంబర్ 17: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ రాత్రి జాగరణ, 18వ తేదీ తెల్లవారుఝామునుంచి ఉత్తర ద్వార దర్శనం, బంగారు దక్షిణావృత శంఖంతో తీర్థం స్వీకరించేందుకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈఓ మండెపూడి పానకాలరావు, మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు, ఎఎంసి చైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్, వైస్‌చైర్మన్ గుత్తికొండ ధనుంజయరావు, పట్టణ సీఐ బీ హరికృష్ణ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముక్కోటి వాల్‌పోస్టరును, ఆహ్వాన పత్రికలను చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ చిరంజీవి మాట్లాడుతూ రాజధానికి సమీపంలో ఉన్న మంగళగిరి ఆలయానికి భక్తుల సంఖ్య పెరిగిందని, తిరుమల తరువాత రాష్ట్రంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి జరిగేది మంగళగిరిలోనే కావటంతో లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏర్పాట్లు ఘనంగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా ఉత్తర ద్వార దర్శనానికి ఆహ్వానిస్తామని చెప్పారు. వీఐపీల సేవలు తగ్గించి సామాన్య భక్తులకు త్వరిత గతిన దర్శనం లభించేటట్లు ఏర్పాట్లు ఉండాలని అన్నారు. పట్టణ సీఐ హరికృష్ణ మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు నేరుగా శంఖుతీర్థానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు ఉంటే బాగుంటుందని పేర్కొనగా కొన్ని కారణాల వలన అది సాధ్యం కాదని ఈఓ పానకాలరావు స్పష్టం చేశారు. డిసెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం నుంచి 18వ తేదీ రాత్రి 2 గంటల వరకు ఆలయ పరిసరాల్లో మద్యం విక్రయాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. డిప్యూటీ తహశీల్దార్ ఆరోగ్య కిరణ్‌కుమార్, మున్సిపల్ డీఈఈ పీ ఏడుకొండలు, విద్యుత్, ఎక్సైజ్, ఆర్‌టీసీ, అగ్నిమాపక శాఖ, దేవాదాయ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.