గుంటూరు

రూ. 6.03 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకరికల్లు, నవంబర్ 17: అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన నకరికల్లులో 6.03కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సీసీ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసి, నకరికల్లు నుండి శివాపురం తండాకు, శివాపురం తండా నుండి చాకలికుంట తండా వరకు సుమారు ఐదుకోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అంగన్‌వాడీ భవనాన్ని, జలవనరుల విభజన శాఖా భవనాన్ని, డంపింగ్ యార్డును ఆయన ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన మంచినీటి పైపులైను ఆయన ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల కాలంలో నకరికల్లులో 27,04,18,000 విలువైన అభివృద్ధి పనులు నిర్వహించినట్లు కోడెల తెలిపారు. ఎన్టీఆర్ గృహాలు, ఇళ్ళ స్థలాలు, పెన్షన్లు, మహిళలకు పసుపు, కుంకుమ పథకం ద్వారా, ఆరోగ్య వైద్య ఖర్చుల నిమిత్తం, చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామన్నారు. అభివృద్ధిని గుర్తించి నాయకులను ఎన్నుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఏన్నోసార్లు తమసేవలు అందించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నాయకత్వం వహించిన న్యాయవాది అలీ బాషాను అభినందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.