గుంటూరు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), నవంబర్ 17: అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరం న్యాయం చేయాలని, లేనిపక్షంలో హాయ్‌ల్యాండ్‌ను ముట్టడిస్తామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. శనివారం స్థానిక మల్లయ్యలింగం భవన్ నుంచి జిన్నాటవర్ సెంటర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అగ్రిగోల్డ్ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసపూరిత వైఖరితో కోర్టులో హాయ్‌ల్యాండ్ తమది కాదని తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే అగ్రిగోల్డ్ సంస్థ ఏ రోజూ హాయ్‌ల్యాండ్ తమది కాదని ప్రకటించలేదని, అవ్వా సోదరులు ఎప్పూడు నోరు మెదపకుండా నేడు తమది కాదనడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. హాయ్‌ల్యాండ్ పేరిట బ్యాంకుల్లో లోన్లు కూడా తీసుకుని నేడు సంబంధం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది ఉన్నారని, వారందరూ యాజమాన్యానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వం సత్వరమే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి చొరవ చూపాలని, మోసపూరితంగా ప్రవర్తిస్తే హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ బాధితులతో ఆక్రమింపజేసి పంచిపెడతామని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్‌ను చూపించి వ్యాపారం చేశారని, ఈ రోజు హాయ్‌ల్యాండ్ తమదికాదని హైకోర్టులో చెప్పడం సరికాదన్నారు. బాధితులకు చివరిపైసా వచ్చే వరకు సీపీఐ వారికి అండగా పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు పులి సాంబశివరావు, నూతలపాటి చిన్న, వి సుబ్బారావు, కనకరాజు ప్రసాద్, అమీర్‌వలి, రత్నం, బాధితులు, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.