గుంటూరు

జిల్లా మినీ మహానాడు ముసాయిదా తీర్మానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 22: జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో జరిగిన జిల్లా మినీ మహానాడులో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్‌టి రామారావు పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి పార్టీని క్రమశిక్షణతో నడిపారని, ఆయనకు సమావేశం జోహార్లర్పించింది. రెండేళ్ల పాటు ఎలాంటి కుంభకోణాలకు ఆస్కారం లేకుండా సుపరిపాలనకు, ప్రజలకు ఉచిత ఇసుక అందించినందుకు చంద్రబాబు నాయుడుకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్రంలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను 16,250 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అభినందనలు తెలిపింది. జిల్లాలో ఎన్‌టిఆర్ హౌసింగ్ పథకం కింద 18 వేల గృహాలు, అర్బన్ హౌసింగ్ స్కీం వద్ద 24,576 గృహాలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. అమరావతి రాజధానిలో బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతించింది. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. జిల్లాలో అదనంగా 91 వేల పేద కుటుంబాలకు రేషన్‌కార్డులు, రాష్ట్రంలో కాపుల అభ్యున్నతికి కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి 1000 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. రాజధాని ప్రాంతంలో 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా భూ సమీకరణలో ప్రభుత్వానికి అందజేసిన 29 గ్రామాల రైతులకు అభినందించింది. రాజధాని ప్రాంతంలో అన్ని కుటుంబాల వారికి ఉచిత వైద్యం, విద్యను అందించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మహానాడు హర్షం వ్యక్తంచేసింది. ప్రపంచంలో ఎక్కడా జరగని భూ సమీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి సచివాలయ భవనాన్ని నిర్మిస్తూ నవ్యాంధ్రకు అద్భుతమైన రాజధానిని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ కార్యకర్తలకు విశేష సేవలందిస్తున్న నారా లోకేష్‌లకు ఈ సమావేశంలో అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు మొత్తంగా ప్రతిపాదించిన 27 తీర్మానాలకు నాయకులు, కార్యకర్తలు తమ ఆమోదాన్ని వ్యక్తంచేశారు. ఈనెల 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరిగే మహానాడులో ఈ తీర్మానాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.