గుంటూరు

ఎస్‌ఐ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) డిసెంబర్ 10: రేంజ్ పరిధిలో ఈనెల 16న జరగనున్న ఎస్‌ఐ అభ్యర్ధుల పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రేంజ్ ఐజి కేవీవీ గోపాలరావు సిబ్బందికి సూచించారు. సోమవారం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్‌ఐ పరీక్షలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఐజి కేవీవీ గోపాలరావు మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎస్‌ఐ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా గుంటూరు అర్బన్ పరిధిలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్‌ఐ పరీక్షలను సక్రమంగా ఒక పద్ధతిలో ఎక్కడా ఎటువంటి లోపాలు జరగకుండా సిబ్బంది వ్యవహరించాలన్నారు. ప్రతిపరీక్షా కేంద్రానికి ఒక ఎస్‌ఐతో పాటు ఐదుగురు సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. రేంజ్ పరిధిలో మొత్తం 26,746 మంది అభ్యర్థులు హాజరతున్నారని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. హాజరయ్యే అభ్యర్థులు కూడా తప్పక గుర్తింపు కార్డుతో హాజరుకావాలని, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించకూడదని పరీక్షా హాల్‌లో ప్రక్క వారితో మాట్లాడకూడదన్నారు. ఈ సమావేశంలో అర్బన్ అదనపుఎస్పీ శ్రీ రాఘవ, నాగార్జున యూనివర్శిటీ ప్రిన్సిపాల్ సిద్ధయ్య, వివిధ విభాగాల పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

సాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలి
*ఘనంగా నాగార్జునసాగర్ ఫౌండేషన్ డే వేడుకలు
విజయపురిసౌత్, డిసెంబర్ 10: నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టు రైతులు నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సాగర్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ బత్తుల వెంకటస్వామి అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపనచేసి నేటికి 63 వసంతాలు పూర్తి చేసుకొని 64వ వసంతంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా సోమవారం డ్యాం కుడివైపున ఉన్న ఫౌండేషన్ స్టోన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ ఎందరో కృషి, పట్టుదల, కార్యదీక్షత, త్యాగాల ఫలితమే నేటి నాగార్జునసాగర్ అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పంట భూములను సస్యశ్యామలం చేస్తూ ప్రజల గొంతును తడుపుతూ వేల గ్రామాలలో కాంతి నింపుతున్న అతిపెద్ద బహుళార్థక సాదక ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టు అని కొనియాడారు. జవహర్‌లాల్ నెహ్రుచే ఆధునిక దేవాలయంగా కీర్తింపబడిన సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, సంఘసంస్కర్తలు, కూలీలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమానికి ముందుగా నెహ్రు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఈలు మురళీధర్, వెంకటేశ్వర్లు, ఏ ఇలు అనితశ్రీ, వెంకటసుబ్బయ్య, ఇరిగేషన్, కెనాల్స్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.