గుంటూరు

మహిళల్లో వినూత్న ఆలోచనలకై ‘మేలుకొలుపు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట), డిసెంబర్ 13: మహిళల భద్రత కోసం జిల్లా రూరల్ పోలీసు బాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల చూపుతున్న వివక్షత, జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులను అరికట్టేందుకు, స్ర్తిలను రక్షణ కల్పించేందుకు మేలుకొలుపు కార్యక్రమాన్ని రూపొందించారు. ముఖ్యంగా సమాజంలో వివక్షత, లైంగికదాడులకు గురైన వారిలో మనోస్థైర్యం నింపేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని రూరల్ ఎస్‌పి ఎస్‌వి రాజశేఖరబాబు గురువారం తెలిపారు. మహిళల్లో ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా వాక్ ఫర్ ఉమెన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా మహిళల్లో చైతన్యం నింపడం, మహిళలపై దాడులను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా మగవారి ఆలోచన విధానం మారాలని మహిళలు అన్ని రంగాల్లో సమానమనే భావన అందరిలో వస్తే సమాజంలో కూడా మార్పు వస్తుందన్నారు. మహిళల భద్రత గురించి లఘునాటికలు, మూకీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 300 మంది కళాకారులు, 1000 మంది విద్యార్థులతో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మహిళల వివక్షతపై సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించి, విద్యార్థి దశ నుండే చైతన్యం నింపే విధంగా కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం తెనాలిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, నన్నపనేని రాజకుమారి, కలెక్టర్ కోన శశిధర్, వాక్ ఫర్ ఉమెన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.

కార్యకర్తల సంక్షేమ నిధి ప్రవేశపెట్టింది టీడీపీయే
* మంత్రులు నక్కా, ప్రత్తిపాటి
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 13: దేశ చరిత్రలోనే కార్యకర్తల సంక్షేమానికి నిధిని ఏర్పాటుచేసి అన్ని పార్టీలకు ఆదర్శంగా నిలిచింది తెలుగుదేశం పార్టీయేనని మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం స్థానిక అరండల్‌పేటలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంక్షేమ నిధి పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లాపార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జాతీయ పార్టీలు సైతం చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం మంత్రి నారాలోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తల నిధికి రూపకల్పన చేసి, వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నారన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా పార్టీ మనోధైర్యం కల్పించి ఆర్థికంగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. అనంతరం కార్యకర్తల సంక్షేమం నిధి నుండి 35 లక్షల 80 వేల రూపాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజామాస్టారు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు చలమారెడ్డి, గంజి చిరంజీవి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, పార్టీ నాయకులు కంచర్ల శివరామయ్య, యర్రగోపు నాగేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదులో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
* నియోజకవర్గాల్లో పరిశీలకులను నియమించాలి * మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 13: సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరుపై జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుతో పాటు ముఖ్యనేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ గత ఆరు దఫాలుగా సభ్యత్వ నమోదులో గుంటూరు జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని, గత ఏడాది సభ్యత్వ నమోదు 8,50,000 కాగా, ఈ ఏడాది సభ్యత్వ నమోదు 10,90,000 మించాలన్నారు. ఇప్పటివరకు 3,50,000 మాత్రమే పూరె్తైందని, ఇంకా 7 లక్షల వరకు సభ్యత్వ నమోదు జరగాలని, కేవలం ఏడు రోజులు మాత్రమే సమయం ఉన్నందున రోజుకు లక్ష సభ్యత్వ నమోదు జరిగితేనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. జిల్లా పార్టీ కమిటీ నుండి ఒక్కొక్క నియోజకవర్గానికి పరిశీలకులను నియమించి సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు వలన కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలను కూడా వివరించాలని గత ఏడాది వినుకొండ నియోజకవర్గం ప్రథమస్థానంలో ఉందన్నారు. సభ్యత్వ నమోదులో నిర్ధేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎఎస్ రామకృష్ణతో పాటు నాయకులు మన్నవ సుబ్బారావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.