గుంటూరు

శతాబ్దాలుగా మహిళలపై వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, డిసెంబర్ 14: సర్వసభ్య సమాజంలో మహిళలపై శాతాబ్దాలుగా వివక్షత కొనసాగుతూనే ఉందని, మహిళకు ఉన్నత గౌరవం ఇచ్చింది, అణగద్రొక్కిందీ ఈ సమాజమేనని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం తెనాలి పట్టణంలో ‘సబల’ నిర్వహణలో భాగంగా ‘మేలుకొలుపు’ కార్యక్రమం కింద స్ర్తివివక్షతపై చైతన్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పురపాలక సంఘం కార్యాలయం నుండి ప్రారంభమైన ఈప్రదర్శన గాంధీచౌక్ మీదగా బోస్‌రోడ్ నుండి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వరకు కొనసాగింది. అనంతరం కళాక్షేత్రంలో మేలుకొలుపులో భాగంగా ప్రజాప్రతినిధులు జ్యోతి ప్రజ్వలనచేసి సభాకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ పోలీసుశాఖ మహిళలను చైతన్య పరిచేందుకు తీసుకున్న మేలుకొలుపు కార్యక్రమం అభినందనీయం అన్నారు. జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సంవత్సరానికి వేయిమంది వరకు మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ సంఘటనలపై 174సెక్షన్ కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామేతప్ప మహిళలను రక్షించలేక పోతున్నామని అందుకు వారు పోలీసులను ఆశ్రయించకపోవడమే కారణంగా చెప్పారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మహిళలను చైతన్య పరిచేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ మహిళలు ఎటువంటి ఆపద స్థితిలో ఉన్నప్పటికీ వెంటనే పోలీసు లేదా మహిళా కమిషన్‌కు ఫోనుద్వారా సమాచారం అందజేస్తే తక్షణమే వారిని ఆదుకునే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లాలోని అందరూ డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి తదతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సాగర్ కుడికాలువకు నీటి సరఫరా నిలిపివేత
విజయపురిసౌత్, డిసెంబర్ 14: నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడికాలువకు విడుదలవుతున్న నీటి సరఫరాను శుక్రవారం ప్రాజెక్టు అధికారులు పూర్తిగా నిలిపివేశారు. గతనెల 7వ తేదీ నుండి రోజుకు 9వేల క్యూసెక్కుల చొప్పున 37 రోజులు 83.05 టిఎంసీల నీటిని సాగర్ జలాశయం నుండి కుడికాలువకు విడుదల చేశారు. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు 91.874 టిఎంసీల నీటిని కుడికాలువ ఆయకట్టు ప్రాంతానికి కేటాయించారు. మిగిలిన నీటిని అవసరాల మేరకు విడుదల చేస్తామని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 549.20 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 208.0186 టి ఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి, కుడి, ఎడమ కాలువలకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఎస్ ఎల్‌బిసి ద్వారా 550 క్యూసెక్కులు, మొత్తం అవుట్‌ఫ్లోగా 560 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 19070 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 846.60 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 72.6505 టి ఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి కుడి, ఎడమ కాలువలకు నీటి సరఫరా నిలిపివేయటంతో విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది.