గుంటూరు

అన్నదాత నడ్డివిరిచిన పెథాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. గడిచిన 24 గంటలుగా కురిసిన భారీవర్షం, ఈదురుగాలులతో వరిపంటకు తీరని నష్టం జరిగింది. పల్నాడు ప్రాంతంలో మిర్చికల్లాల్లోకి వర్షపునీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఉద్యానవన పంటలకు పెద్దగా లేకపోయినప్పటికీ వరి, మిర్చి, ప్రత్తి పంటలకు మాత్రం పెథాయ్ పోటు తప్పలేదు. మరో వారం పది రోజుల్లో వరికోతలు పూర్తికావాల్సిన తరుణంలో పెథాయ్ తుఫాన్ అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. చేతికి అందిరావాల్సిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలో కోతకోసిన 7,316 హెక్టార్లలో ఓదెలు నీటమునగగా, 38,664 హెక్టార్లలో వరిపంట ఈదురుగాలులు, భారీవర్షాలకు నేలవాలింది. డెల్టాలోని చుండూరు మండలంలో అత్యధికంగా 92.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వేమూరులో 87.8, పిట్టలవానిపాలెంలో 86.4, కొల్లిపరలో 81.4, అమృతలూరులో 78.4, నిజాంపట్నం 70.8, రేపల్లెలో 67.8, నగరంలో 66.6, తెనాలిలో 65.2, దుగ్గిరాలలో 61.8, కొల్లూరులో 61.2, చెరుకుపల్లిలో 58.6, మంగళగిరిలో 58.4, కర్లపాలెంలో 53.6, భట్టిప్రోలులో 52.7, రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో 50.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఇలా ఉండగా పల్నాడు ప్రాంతంలోని ముప్పాళ్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో భారీవర్షాలతో కల్లాల్లో ఎండబెట్టిన మిర్చి తడిసిముద్దైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. వర్షం తాకిడితో పగలు, రాత్రి తేడాలేకుండా చలిగాలులు వీచడంతో ప్రజలు చలిపులి ధాటికి బెంబేళెత్తారు.
పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్..
పెథాయ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ డెల్టా, పల్నాడు ప్రాంతాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిపై సమీక్షించారు. జిల్లాలో పెథాయ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లపై వ్యవసాయశాఖ తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కోతకోసిన వరిపంటను ఓదెలపై ఉంచకుండా కుప్పలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగానికి అవగాహన కల్గించాలన్నారు. రేపల్లె, బాపట్ల, తెనాలి, పొన్నూరు, వేమూరు నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు తమ ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలు, రైతులు ఎటువంటి ఇబ్బందులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులోకి వర్షపునీరు చేరడంతో చెరువుపక్కన నివాసం ఉంటున్న ఎస్టీ కుటుంబాలను పునరావాస కేంద్రాలను తరలించినట్లు పేర్కొన్నారు. వారికి అవసరమైన భోజన, వసతి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
* పెథాయ్‌పై సమీక్షలో అర్బన్ ఎస్పీ విజయారావు సూచన
గుంటూరు (అరండల్‌పేట), డిసెంబర్ 17: గత రెండు రోజలు నుంచి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అ ర్బన్ ఎస్పీ సిహెచ్ విజయారావు సిబ్బందికి సూచించారు. సోమవారం తన కా ర్యాలయంలో అర్బన్ పరిధిలోని స్టేషన్ల సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెథాయ్‌పై తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. వర్షాలు పడుతు న్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రక్షక్ వాహనాల ద్వారా పరిస్థితులను గమనించాలని ఆదేశించారు. బలమైన గాలులు వీచినప్పుడు రోడ్డుపై చెట్లు విరిగిపడటం, విద్యుత్ స్తం భాలు నెలకొరిగిన సమయంలో వెంటనే స్పందించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తాడికొండ, మేడికొండూరు, తాడేపల్లి, చే బ్రోలు, మంగళగిరి, ప్రత్తిపాడు ప్రాంతాల నుండి వర్షపు నీరు వల్ల వాగులు కుంటలు పొంగిపోర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవావలన్నారు. కృష్టా పశ్చిమ డెల్టా ప్రాంతంలో నీటి విడుదల ఉన్నందున ప్రవాహం ఎక్కువుగా ఉంటుందని, ఇందుకు సంబంధించిన కాల్వకట్టలు, రేవుల ఉద్ధృతిని రక్షక్ వాహనాలతో తిరుగుతూ గమనించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న అనేక ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు సిబ్బంది ఎక్కడా లోటుపాట్లు లేకుండా సమర్ధవతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.
జగన్మోహినిగా శ్రీ లక్ష్మీ నృసింహుడు
మంగళగిరి, డిసెంబర్ 17: ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి జగన్మోహిని అలంకారం చేసి పుష్పక విమానంపై పురవీధుల్లో ఊరేగించారు. పెదపాలెంకు చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు ఈ ఉత్సవానికి కైంకర్య పరులుగా వ్యవహరించారు. వైకుంఠ ఏకాదశినాడు దేవదానవులు రాత్రింబవళ్లు శ్రమించి సాగర మధనం చేసి అమృతాన్ని పుట్టించారని, దేవతలను రక్షించడానికి రాక్షసులను భయభ్రాంతులను చేయడానికి శ్రీవారు మోహినీ అవతారం ఎత్తారని అర్చక స్వాములు వివరించారు. జగన్మోహినిగా సింగారించుకుని పురవీధుల్లో దర్శన మిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని భక్తులు నేత్ర పర్వంగా దర్శించుకున్నారు. భక్తులు అడుగడుగునా స్వామివారిని దర్శించుకుని పండ్లు, పూలు, టెంకాయలు సమర్పించారు. ఆలయ ఈఓ మండెపూడి పానకాలరావు, సీఎఫ్‌ఓ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

రేపు జీజీహెచ్‌లో సీఎం చంద్రబాబు పర్యటన
ఖరారు
* క్యాత్‌ల్యాబ్ ప్రారంభించనున్న సీఎం * మాతాశిశు సంరక్షణ కేంద్రానికి శంకుస్థాపన
గుంటూరు, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పర్యటన ఖరారైంది. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాత్‌ల్యాబ్, రూ 60కోట్లతో నిర్మిస్తున్న మాతాశిశు సంరక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవంగా సోమవారం ముఖ్యమంత్రి జీజీహెచ్‌కు రావాల్సి ఉండగా పెథాయ్ నేపథ్యంలో పర్యటన వాయిదా పడింది. దీంతో 19న జీజీహెచ్‌కు ముఖ్యమంత్రి పర్యటనపై జీజీహెచ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం క్యాత్‌ల్యాబ్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.

జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవ ఆగడంతో
20వేల మంది రోగులకు ఇక్కట్లు
గుంటూరు (అరండల్‌పేట) డిసెంబర్ 17: రాష్టవ్య్రాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకం కింద చికిత్స పొందుతున్న రో గులకు చికిత్సలు ఆపివేయడయంతో జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిచాయి. ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది రోగులపై ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులపై ప్రభావం చూ పడంతో గత్యంతరం లేక ఖర్చు పెట్టి చికిత్స పొందే పరిస్థితి నెలకొంది. ప్రైవే ట్ ఆసుపత్రులకు జిల్లావ్యాప్తంగా రూ 500 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తె లుస్తోంది. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకాన్ని నిలిపివేశాయి. అయితే డయాలసిస్ రో గులు, క్యాన్సర్ కీమో రోగులకు మా త్రం పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రైవే ట్ ఆసుపత్రుల సంఘం నాయకులు తెలిపారు. ప్రభుత్వం త్వరితగతిన బి ల్లులు మంజూరు చేస్తే పథకాన్ని వెంట నే అమలు చేస్తామన్నారు. బిల్లులు ఇ వ్వకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు అనేక ఇబ్బందులు పడుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్ర భుత్వం బిల్లులు మం జూరు చేసి నిరుపేద రోగులను ఆదుకోవాలని ఇటు ప్రజలూ కోరుతున్నారు.

గుండెచెదిరిన అన్నదాత
* నీటిలో నానుతున్న వరికుప్పలు, ఓదెలు
చేబ్రోలు, డిసెంబర్ 17: తుఫాన్ ప్రభావంతో సోమవారం కురిసిన భారీవర్షానికి అన్నదాత గుండె చెదిరినట్టైంది. కృష్ణా పశ్చిమ డెల్టాలో వేలాది ఎకరాలు వరిపంట నీటిపాలైంది. డెల్టాలోని ప్రధాన కాల్వలుగా ఉన్న కొమ్మమూరు, అప్పాపురం కాల్వల ఆయకట్టు ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది రైతులు వరికోతలు కోయగా ఎక్కువ శాతం వరిపంట వరి ఓదెలపై ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరికుప్పలు వేసినప్పటికీ వర్షం కారణంగా కుప్పల్లోకి వరదనీరు చేరింది. వరి ఓదెలైతే వరదనీటిపై తేలియాడుతున్నాయి. ఈ ఏడాది కూడా నష్టాలు తప్పవని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక రెండవ పంట లేనట్టేనని చెప్తున్నారు.

మిర్చి కల్లాల్లో నీళ్లు మిర్చిరైతు కళ్ళల్లో నీళ్లు
సత్తెనపల్లి, డిసెంబర్ 17: సత్తెనపల్లి రూరల్ పరిధిలోని రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చుట్టు పక్కల గ్రామాలలోని రైతులు పంట చాలావరకు పొలల్లో కల్లాల్లోనే పట్టాలు కప్పివుంచారు. నందిగామ అడ్డరోడ్డువద్ద కొందరు మిర్చిరైతులు కల్లాలను ఏర్పాటుచేసుకొని మిర్చిని ఆరబెట్టుకున్నారు. సోమవారం మొదలైన పెథాయ్ తుఫాన్ ప్రభావంతో దిక్కుతోచని స్థితిలో మిర్చిరైతులు ఉరుకులు పరుగులతో టార్పాలిన్ పట్టాలను కొనుగోలుచేసి కల్లాల్లో ఆరబెట్టుకున్న మిర్చిపై కప్పారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. చేతికందిన పంట నీటిపాలై అప్పుచేసి చెల్లించిన కౌలు నీటిపాలౌతుందని బెంబేలెత్తిపోతున్నారు. చేసేదిలేక రైతులు కళ్ళల్లో నీరు కుక్కుకుని మబ్బులవైపు చూస్తూ దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. అదేవిధంగా వరి మాగాణుల్లో వరి కోసి కుప్పలుగా వేసుకున్నారు. తుఫాన్ భయంతో కోసిన పంటను ముంపుకు గురికాకుండా ఒడ్డుకు చేర్చుకుంటున్నారు. తుఫాన్ తమను అప్పుల ఊబిలోకి నెడుతోందని నందిగం గ్రామానికి చెందిన రాజు అనే రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. సంబంధిత ప్రభుత్వ అధికారులు తమవైపు కనె్నతె్తైనా ఇంతవరకూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షంతో కూలిపోయిన ముక్కోటి టెంట్లు
మంగళగిరి, డిసెంబర్ 17: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి జాగరణ, మంగళవారం తెల్లవారుఝాము నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం వేసిన టెంట్లు పెథాయ్ తుఫాను కారణంగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు కూలిపోయాయి. తడిసిముద్దై బరువెక్కి టెంట్లన్నీ నేలకు వాలాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గి చలిగాలులు వీస్తున్నాయి. తడిసిన టెంట్లను పైకి లేపే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. ముక్కోటి ఏర్పాట్లకు వర్షం తీవ్ర ఆటంకం కలిగించింది. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక వర్షాలు రావడంతో టెంట్లన్నీ తడిసి నేలవాలాయి. భక్తుల కోసం ఇబ్బంది లేకుండా చేసేందుకు పోలీసు, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, డిఎస్పీ రామకృష్ణ ఆలయ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లపై ఆలయ ఈఓ మండెపూడి పానకాలరావుతో చర్చించారు. వర్షం, చలిగాలుల కారణంగా ఉత్తర ద్వార దర్శనానికి తరలివచ్చే భక్తుల సంఖ్య తగ్గవచ్చనే అంచనా వేస్తున్నారు. అయితే వచ్చిన భక్తులకు ఉత్తర ద్వార దర్శనం, దక్షిణావృత శంఖంతో తీర్థం అందించేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం అగ్రస్థానం
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 17: దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ షభ్యుడు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక ఏటి అగ్రహారంలోని గిరిజన గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఆయన ఉచితంగా రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం దళితులు, గిరిజనుల అభ్యున్నతికి పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా 100 యూనిట్ల వరకు దళితులు, గిరిజనులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గిరిపుత్రిక పథకం ద్వారా 50 వేల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. సంక్షేమ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మార్చి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నూతన గురుకుల పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక నిధులు వెచ్చిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎంవి రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ కె ప్రమీలారాణి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి పి మధు, గిరిజన సంఘ నాయకులు పాలపర్తి చంద్రశేఖర్, కండెల ఆంజనేయులు, ఎం శివానాయక్, కట్టా కోటేశ్వరరావు, అధ్యాపకులు శాంతిసుధ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

25న బీసీలతో ధర్నా
చిలకలూరిపేట, డిసెంబర్ 17: బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈనెల 25వ తేదీన బీసీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు వైసీపీ నర్సరావుపేట పార్లమెంటు కన్వీనర్ అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో అంబటి మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం బీసీలను వంచించిందని, వారి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్తూ కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బీసీ ఓట్లతో గెలిచి గద్దెనెక్కి వారి సంక్షేమాన్ని పక్కనబెట్టారని మండిపడ్డారు. నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సంవత్సరానికి 10 వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్నామని చెప్తున్న రాష్ట్రప్రభుత్వం ఆచరణలో అమలుపర్చకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. బీసీలతో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆమె కోరారు.