గుంటూరు

కనుల పండుగగా జాతీయ మహిళా కబడ్డీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి , ఫిబ్రవరి 13 : యరపతినేని చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండు రోజుల నుండి స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరుగుతున్న జాతీయ మహాళా కబాడి పోటీలు కనుల పండగగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఆంధ్ర-చెన్నై టీముల మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో పేక్షకులు ఉత్కంఠతో పోటీలను వీక్షించారు. ఆల్ ఇండియా కబాడి అసోసియేషన్ అధ్యక్షులు వీర్ల అంకయ్య సారధ్యంలో దాచేపల్లి యంపీపీ అంబటి నవకుమార్ నేతృత్యంలో భారి ఏర్పాట్లతో పోటీలు నేత్రానందంగా జరుగుతున్నాయి. ఈపోటిలలో డిల్లీ, ఆంధ్ర, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పూనే తదితర ప్రాంతాలనుండి 15టీములు పాల్గొంటూ వుండటంతో సందడి వాతావరణం నెలకొన్నది. ఈపోటీలను తిలకించేందుకు గురజాల యమ్మేల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రతిరోజు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వస్తూ క్రీడాకారులను ఉత్సాహాపరుస్తున్నారు. అదే విధంగా పోటీలను చూసేందుకు పురుషులు, మహిళలు, విద్యార్థులు భారి సంఖ్యలో తరలిరావడంతో హైస్కూల్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

కన్నాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 13: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ కన్నా మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. నగర తెలుగు యువత అధ్యక్షుడు యల్లావుల అశోక్ మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ అవినీతి ఆరోపణలు చేయడం మానుకుని, సాక్ష్యాలు ఉంటే నిరూపించాలన్నారు. నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.