గుంటూరు

పోలింగ్ కేంద్రాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో జరగనున్న పట్ట్భద్రులు, సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించడానికి పోలింగ్ కేంద్రాల్లో వౌళిక సదుపాయాల కల్పనకై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్‌చంద్ర పునేఠ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని పునేఠ సూచించారు. పోలింగ్ కేంద్రాలు ఆయా భవనాల కింది అంతస్తులలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వృద్దులు, వికలాంగులకు కూడా సౌకర్యవంతంగా ఉండేందుకు ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మిగిలియున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ అధికారులతో సమావేశమై మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4,416 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, వాటికి అవసరమైన తాగునీరు, విద్యుత్ ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు సంయుక్త కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారిణి శ్రీలత, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి ఇతర శాఖల అధితరులు పాల్గొన్నారు.