గుంటూరు

రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా విధులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట), ఫిబ్రవరి 27: రాబోవు ఎన్నికల్లో పోలీసుశాఖ సిబ్బంది రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని, రాజకీయపరమైన, అనవసరమైన కేసులు నమోదు చేయవద్దని రూరల్ ఎస్పీ ఎస్‌వి రాజశేఖరబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ఎన్నికల విధులు గురించి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసుస్టేషన్‌లలో హౌస్ ఆఫీసర్లు, వివిధ అధికారులతో ఆయన తన కార్యాలయం నుంచి సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీసుశాఖలో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా తమ విధులు సమర్ధవంతంగా నిర్వహించి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. రాజకీయ నాయకుల ప్రలోభాలతో ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని తప్పనిసరైతే తమని సంప్రదించాలని సూచించారు. రాజకీయ నాయకుల మాట వింటూ ఏమైనా ఆరోపణలు వస్తే వారిపై వేటు వేసేందుకు వెనుకాడనని స్పష్టంచేశారు. అసాంఘీక శక్తుల పట్ల ఉక్కుపాదం మోపాలని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో రౌడిషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి నిఘా పెంచాలన్నారు. పోలీసుశాఖ సిబ్బంది రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించకుండా పోలీసుశాఖ ప్రతిష్టను పెంచేవిధంగా విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని ఎస్పీ రాజశేఖరబాబు సూచించారు.

అర్హుల ఓట్లు తొలగించొద్దు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల
పొన్నూరు, ఫిబ్రవరి 27: నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ఓట్ల రద్దుకు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఎన్నికల అధికారి పి కొండయ్యను కలిసి ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ విజ్ఞప్తిచేశారు. పొన్నూరు తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం కొండయ్యను కలిసిన ధూళిపాళ్ల నరేంద్ర బృందం ఈ విషయమై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ ఎన్ ప్రభాకరరావు, మాజీ చైర్మన్ మాదల వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ హేమలత, వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు, కౌన్సిలర్‌లు ఎస్‌కె గౌస్, సిలార్ బాషా, యరసాని శ్రీరామమూర్తి, దాసరి శ్రీనివాసరావు, కరిముల్లా, పట్టణ, మండల టీడీపీ అధ్యక్షులు అహమ్మద్ ఖాన్, బొర్రు రామారావుతో పాటు పిన్నమనేని రామకోటేశ్వరరావు, పి సుబ్బారావు, ఎద్దు సోంబాబు, గరిగంటి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.