గుంటూరు

జిల్లాలో పెరిగిన మద్యం అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 1: జిల్లాలో కరవు, వేసవి వెతలు ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజలను కుంగదీస్తున్నప్పటికి మందుబాబులపై ఆ ప్రభావం ఎంత మాత్రం లేదని 2015-16 ఏడాదిలో నమోదైన అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే అర్ధమవుతోంది. ఈ ఏడాది అమ్మకాల్లో 12.16 శాతం వృద్ధి నమోదైంది. 2014-15 సంవత్సరంలో రూ.1192.18 లక్షల వ్యాపారం చోటుచేసుకోగా, 2015-16 నాటికి 1337.21 లక్షల అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 2014-15 సంవత్సరంలో 11,10,729 యూనిట్ల మద్యం అమ్మకాలు జరుగగా, 5,56,803 బీరు బాటిల్స్ విక్రయించారు. 2015-16 సంవత్సరంలో మద్యం అమ్మకాలు 11,86,649 యూ నిట్లు కాగా బీరు బాటిల్స్ వ్యాపారం 6,42,046కు చేరుకుందని గణాంకాలు వివరిస్తున్నాయి. గుంటూరు-1,2, ప్రత్తిపాడు, పెదకూరపాడు, మంగళగిరి పరిధిలో 11,74,370 యూనిట్ల మద్యం కాగా బీరు బాటిల్స్ 5,96,301లుగా అమ్మకాలు నమోదైయాయి. గుంటూ రు పరిధిలోని మద్యం దుకాణాల్లో రూ.49280.72 లక్షలు అమ్మకాలు జరిగాయి. తెనాలి, దుగ్గిరాల, రేపల్లె, నగరం, బాపట్ల, పొన్నూరు పరిధిలో గల మద్యం దుకాణాల్లో జరిగిన వ్యాపార వివరాలు ఇలా ఉన్నాయి. 2015-16 సంవత్సరానికి మద్యం యూనిట్ల అమ్మకాలు 8,85,854 కాగా బీరు విక్రయాలు 3,29,893 జరుగగా, మొత్తం 34221.61 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. నరసరావుపేట, చిలకలూరిపేట, సతైనపల్లి, క్రోసూరు, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల, వినుకొండ, ఈపూరు తదితర ప్రాంతాల్లో మద్యం యూనిట్లు 11,88,649 కాగా బీరు విక్రయాలు 6,42,046 జరుగగా, మొత్తం 50218.55 లక్షల రూపాయలు నగదు సమకూరినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం బెల్టు షాపులను తొలగిస్తామని ప్రకటించినప్పటికి అమలు చేయటంలో విఫలం చెందటంతో వ్యాపారులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో బెల్టు షాపుల కారణంగా అనేక వివాదాలు చోటుచేసుకుంటున్నప్పటికి అధికారులపై స్ధానిక నాయకుల పెత్తనం అధికంగా ఉండటంతో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అందువల్లనే మద్యం విక్రయాలు నానాటికి పెరుగుతున్నందునే 12 శాతం వ్యాపారం పెరగటంతో వలన మద్యంబాబుల జేబులు ఖాళీ అయినప్పటికి కిక్ ఇస్తుందనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జెఇఇఇ పరీక్ష కేంద్రాలకు 162 ప్రత్యేక బస్సులు
* ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌లు: ఆర్‌ఎం శ్రీహరి
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 1: ఈనెల 3వ తేదీ ఆదివారం గుంటూరులో నిర్వహించబోయే జెఇఇఇ 2016 పరీక్షలకు ఆర్టీసీ 162 ప్రత్యేక బస్సులను కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లోని తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. గుంటూరు ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ నుండి వివిధ రూట్లలో ఉన్న పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలకు 9600 మంది విద్యార్థులు తల్లిదండ్రులతో సహా హాజరవుతున్నారని, పరీక్ష ముగిసిన తర్వాత కూడా తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా అన్ని రూట్లలో సర్వీసులు నడుపుతున్నామన్నారు. ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లో హెల్ప్ డెస్క్‌ల ద్వారా విద్యార్థులు హాజరయ్యే పరీక్షా కేంద్రాల సమాచారాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం, మార్కెట్ సెంటర్, ఎసి కాలేజ్ ప్రాంతాల్లో దూరప్రాంత విద్యార్థుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సుల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అమరావతి, లాం, హిందూ ఫార్మసీ కళాశాలలకు 42 బస్సులు, పర్చూరు వయా పుల్లడిగుంట 14 బస్సులు, పర్చూరు వయా వింజనంపాడు 3, పొన్నూరు వయా చేబ్రోలు 22, సత్తెనపల్లి వయా నల్లపాడు, విశదల 50, చిలకలూరిపేట వయా చౌడవరం 17 బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసేందుకు ఆర్టీసీ అధికారులను అందుబాటులో ఉంటారన్నారు.

నిరుపేదల ఇళ్లస్థలాలకు పట్టాలివ్వాలి
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 1: రాష్టవ్య్రాప్తంగా లక్షలాది మంది నిరుపేదలు దశాబ్దాల కాలంగా ప్రభుత్వ, కొండ, పోరంబోకు, అసైన్డ్ తదితర భూములను ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారని, వారికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పట్టాలు మంజూరు చేయాలని, వౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ రిలే నిరాహారదీక్షలను చేపట్టారు. ఈ దీక్షలను ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రారంభించి ప్రసంగించారు. నగరంలోని పాత గుంటూరు, ప్రగతినగర్, చాండ్ర రాజేశ్వరరావు నగర్‌లలో నిరుపేదలు భూములు చదును చేసుకుని గృహాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలన్నారు. రోడ్డు, విద్యుత్, మంచినీటి వౌలిక సదుపాయాలు కూడా కల్పించాలన్నారు. పారిశ్రామిక వేత్తలకు, బడా వ్యాపార వేత్తలకు వేలాది ఎకరాల భూములు కట్టబెడుతున్నారని, పేదవాడు 100 గజాల స్థలం అడిగితే ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం బాధాకరమన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. జిల్లాస్థాయిలో ఇళ్లు లేని లబ్ధిదారులను ఎంపిక చేసి అపార్ట్‌మెంట్‌లు కట్టించి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, నూతలపాటి చిన్న, రాగం అలివేలు మంగమ్మ, సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీల పెంపు దారుణం: ఆర్కే
మంగళగిరి, ఏప్రిల్ 1: రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. శుక్రవారం నాడిక్కడ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆర్కే మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో విద్యుత్ చార్జీలను పెంచకుండా పాలన సాగించారన్నారు. చంద్రబాబు పాలన రెండేళ్లు పూర్తికాకముందే విద్యుత్, ఆర్‌టిసి చార్జీలను పెంచి పేదలపై భారం మోపారని అన్నారు. శాసనసభలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు మాయనిమచ్చగా మిలిగి పోతుందని, ముఖ్యమంత్రి, మంత్రులంతా సభ సాక్షిగా అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దయితే ఎన్నికల్లో తిరిగి గెలవలేమనే భయంతో వారిని రక్షించేందుకు దుస్సంప్రదాయాలకు ప్రభుత్వం ఒడిగట్టిందని ఆర్కే అన్నారు. ప్రతిపక్షనేతకు మైకు ఇవ్వడంలోను స్పీకర్ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉందని ఆర్కే అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, అవసరమైన సమయంలో గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కేవలం రాజధాని జపంతో కాలం వెళ్ళబుచ్చుతున్న ప్రభుత్వానికి ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆగ్రహ జ్వాల బైటపడేరోజు ఎంతో దూరంలో లేదని ఆర్కే అన్నారు. వైసీపీ పట్టణ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు, రూరల్ కన్వీనర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపిపి పచ్చల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా ఇసుక నిల్వచేస్తే కఠిన చర్యలు
తుళ్లూరు, ఏప్రిల్ 1: మండలంలోని దొండపాడు గ్రామంలో ఇసుక నిల్వలపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం శుక్రవారం దాడులు నిర్వహించింది. గ్రామంలోని రెండు ప్రదేశాల్లో సుమారు 190 ట్రాక్టర్ల ఇసుకను స్థానికులు నిల్వచేశారు. టాస్క్ఫోర్స్ సమాచారం ప్రకారం దాడులు నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఎ సుధీర్‌బాబు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తామని, అక్రమంగా ఇసుకను నిల్వచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అమరావతి సిఐ హనుమంతరావు, తుళ్లూరు ఎస్‌ఐలు సిహెచ్ రవిబాబు, జి సందీప్ పాల్గొన్నారు.