గుంటూరు

విగ్రహాల వద్ద ఆక్రమణల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, మే 27: గుంటూరు- మాచర్ల ప్రధాన రహదారి వెంబడి పట్టణ పోలీస్టేషన్, తహశీల్దార్ కార్యాలయం సెంటర్ వద్దగల పొట్టిశ్రీరాములు, వివేకానందుడు, రోటరీక్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ట్యాంక్, చతుర్వేదుల శీతారామశాస్ర్తీ, వావిలాల గోపాలకృష్ణయ్య, వైయస్ రాజశేఖరరెడ్డి, జ్యోతిరావ్‌పూలే విగ్రహాల వద్ద మార్జిన్ గీతను గీసి మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు ఆధ్వర్యంలో శుక్రవారం విగ్రహాలను తొలగించకుండా ఆక్రమణలతోపాటు ముందుకు వచ్చిన పండ్లవ్యాపారులు, చిరువ్యాపారుల షాపులను వెనక్కు జరిపించారు. ఇదిలావుండగా లక్షలు ఖర్చుచేసి పొట్టిశ్రీరాములు, వివేకానంద విగ్రహాలవద్ద భారీగా గ్రానేట్స్‌తో ఏర్పాటుచేసిన ప్లాట్‌ఫామ్‌ను మినీ జేసీబితో తొలగిస్తుండడంతో వాటిని ఏర్పాటు చేసిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగింపులకు పాల్పడడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2002లో స్థానిక పోలీస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకును పూర్తిగా తొలగించివేశారు. చతుర్వేదుల శీతారామశాస్ర్తీ, వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహాలవద్ద నాపరాళ్ళ ప్లాట్‌ఫాంను చాలావరకు తొలగించారు. ఉదయం 7 గంటలకే మున్సిపల్ అధికారులు తన సిబ్బందితో వచ్చి యుద్ధప్రాతిపదికన తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగిస్తున్నారన్న వార్తపుకారు పట్టణంలో షికారు చేయడంతో వైసిపి నాయకులు పట్టణ యూత్ ప్రెసిడెంట్ అచ్యుత శివప్రసాద్, జిల్లా కార్యదర్శి గార్లపాటి ప్రభాకరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మదుమంచి రాంబాబు, మున్సిపల్ కౌన్సిల్ ప్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు, జిల్లా ఎస్‌సి సెల్ కార్యదర్శి మద్దు రత్నరాజు, జిల్లా బీసి సెల్ ప్రధానకార్యదర్శి దుగ్గి బద్రయ్య, బీసి సెల్ పట్టణ అధ్యక్షుడు తుమ్మల వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు వల్లెం నరసింహారావు, సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు ఇసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి చిలుకారమణయ్య, జగన్నాధం, ఇన్నారిడ్డి తదితరులు ఒక్కరొక్కరిగా రాజశేఖర విగ్రహాం వద్దకు చేరుకొని మున్సిపల్ అధికారులను ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనితో కొంతసేపు ఉత్కంఠత చోటుచేసుకుంది. ఏ విగ్రహాన్ని తొలగించడంలేదని రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన మెట్లను మాత్రమే తొలగిస్తామని చెప్పడంతో విగ్రహం పిల్లర్ దెబ్బతినకుండా ముందు జాగ్రత్తచర్యలను పార్టీనాయకులు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. విగ్రహాల నీడన వ్యాపారాలు చేసుకుంటున్న వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తహశీల్దారు కార్యాలయం వద్దనుండి రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకువున్న పండ్ల, చిరువ్యాపారులను పట్టణ సిఐ సాంబశివరావు వెంటరాగా మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు వారి షాపులను వెనక్కు జరగాలని లేకుంటే మున్సిపల్ కార్యాలయానికి తరలిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా తహశీల్దార్ కార్యాలయం కాంపౌండులోవున్న బైక్ స్టాండ్‌ను తహశీల్దార్ కార్యాలయం వెనక్కు మార్చాలని నిర్వాహకులకు సూచించారు. ఆక్రమణల తొలగింపులో కమిషనర్‌తోపాటు టీపీఓ వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్‌ఓ రంగారావు, బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్ అనురాధ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.